ఇండియా ఎఫెక్ట్ : పాక్‌లో భగ్గుమన్న టీ ధరలు

పాకిస్తాన్ దేశంలో టీ ధరలు భగ్గుమంటున్నాయి. 10 రూపాయలు ఉండే ఛాయ్.. ఇప్పుడు 20, 30 రూపాయలు

  • Published By: veegamteam ,Published On : February 18, 2019 / 07:40 AM IST
ఇండియా ఎఫెక్ట్ : పాక్‌లో భగ్గుమన్న టీ ధరలు

పాకిస్తాన్ దేశంలో టీ ధరలు భగ్గుమంటున్నాయి. 10 రూపాయలు ఉండే ఛాయ్.. ఇప్పుడు 20, 30 రూపాయలు

పాకిస్తాన్ దేశంలో టీ ధరలు భగ్గుమంటున్నాయి. 10 రూపాయలు ఉండే ఛాయ్.. ఇప్పుడు 20, 30 రూపాయలు అయినా ఆశ్చర్యం లేదు. రాబోయే రోజుల్లో మరింత కొరత ఏర్పడనుంది. దీనికి  కారణం భారత్. పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడికి నిరసనగా.. భారత టీ వ్యాపారులు ఎగుమతులను నిలిపివేయాలని నిర్ణయించారు. దీంతో అక్కడ టీ పొడికి కొరత ఏర్పడనుంది. ఈ విషయం  తెలిసిన పాక్ వ్యాపారులు.. అప్పుడే ధరలను పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి.

 

పాకిస్తాన్‌కు టీ ఉత్పత్తులు ఎగుమతి నిలిపివేయడం ద్వారా ఆర్థికంగా నష్టపోతామని టీ వ్యాపారులు చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యం అని వ్యాపారులు స్పష్టం  చేశారు. 2018లో 15.83 మిలియన్ కేజీల టీ ఉత్పత్తులను పాకిస్తాన్‌కు భారత్ ఎగుమతి చేసింది. దీని విలువ రూ. 154.71 కోట్లు. మన టీ ఉత్పత్తులకు పాక్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. పెద్ద  ఎత్తున బిజినెస్ జరుగుతుంది. భారత్ నుంచి పంపే టీ ఉత్పత్తుల ద్వారా పాక్ ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది. ఇప్పుడు టీ ఉత్పత్తుల ఎగుమతులను ఆపేయాలని భారత టీ  ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్‌కు గట్టి షాక్ అనే చెప్పాలి.

 

పాకిస్తాన్‌లో ఏటా 1,72,911 టన్నుల బ్లాక్ టీ వినియోగం జరుగుతుందని లెక్కలు చెబుతున్నాయి. 2027 నాటికి ఆ సంఖ్య 2,50,755 టన్నులకు పెరగనుంది. ఈ పరిస్థితుల్లో డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోతే పాక్ వ్యాపారులకు తిప్పలు తప్పవు. పోనీ ఇతర దేశాల నుంచి టీ పొడి దిగుమతి చేసుకుందామని పాక్ ప్రభుత్వం అనుకున్నా.. దాని వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ తక్కువ ధరకు టీ పొడిని పాక్‌కు ఎక్స్‌పోర్టు చేస్తుంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే భారీగా పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఆ పన్నులన్నీ చెల్లించాక పెద్దగా ప్రాఫిట్ ఉండదు. దీంతో పాక్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. టీ పొడి ఎగుమతులు నిలిపివేయాలని భారత టీ ఎక్స్‌పోర్టర్ల సంఘం తీసుకున్న నిర్ణయం పాక్ ప్రభుత్వానికి చెమట్లు పట్టిస్తోంది. ఇదే కాదు.. ముందు ముందు పాకిస్తాన్‌కు మరిన్ని ఆర్థిక ఇబ్బందులు కలగనున్నాయి.

Read Also : దేశ ద్రోహులు: జవాన్ నష్ట పరిహారాన్ని దొంగిలించారు

Read Also : Pulwama effect: పాక్ క్రికెట్ మ్యాచ్‌లు మేం ప్రసారం చేయం