China–India: భారత్‌తో చైనా దళాల ఘర్షణ వార్తలు ఖండించిన ఇండియన్ ఆర్మీ!

చైనా దళాలు మరోసారి భారత్‌ ఆర్మీతో ఘర్షణ పడుతున్నాయని వస్తున్న మీడియా నివేదికలను భారత సైన్యం ఖండించింది. తూర్పు లడఖ్‌లో చైనా దళాలు భారత్‌తో మళ్లీ ఘర్షణ పడ్డాయనే మీడియా కథనాలను భారత దళాలు బుధవారం (జూలై 14, 2021) ఖండించాయి. ఈ వార్తా కథనాన్ని 'ధృవీకరించని వాస్తవాలతో' ప్రచురించారని.. అందుకే తీవ్రంగా ఖండించామని భారత సైన్యం తెలిపింది.

China–India: భారత్‌తో చైనా దళాల ఘర్షణ వార్తలు ఖండించిన ఇండియన్ ఆర్మీ!

China–india

China–India: చైనా దళాలు మరోసారి భారత్‌ ఆర్మీతో ఘర్షణ పడుతున్నాయని వస్తున్న మీడియా నివేదికలను భారత సైన్యం ఖండించింది. తూర్పు లడఖ్‌లో చైనా దళాలు భారత్‌తో మళ్లీ ఘర్షణ పడ్డాయనే మీడియా కథనాలను భారత దళాలు బుధవారం (జూలై 14, 2021) ఖండించాయి. ఈ వార్తా కథనాన్ని ‘ధృవీకరించని వాస్తవాలతో’ ప్రచురించారని.. అందుకే తీవ్రంగా ఖండించామని భారత సైన్యం తెలిపింది. ఈ కథనాలను ప్రచురించిన వారు తప్పుడు సమాచారంతో చిక్కుకున్నారని అని వారు తెలిపారు.

చైనాతో ఒప్పందాలు కుప్పకూలి.. మరోసారి లఢఖ్ ఇరు దేశాల సైన్యాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని పేర్కొన్న వార్తా నివేదిక పూర్తిగా నిరాధారమైనదని ఆర్మీ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒప్పందం తర్వాత ఇరువైపులా ఎటువంటి ప్రయత్నం జరగలేదని పేర్కొన్నారు. సదరు వార్త సంస్థ ప్రచురించినట్లుగా గాల్వన్ లో కానీ మరే ఇతర ప్రాంతంలో కానీ ఎలాంటి ఘర్షణలు జరగలేదని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం బ్యాలెన్స్ సమస్యలను పరిష్కరించడానికి భారత్, చైనా మధ్య చర్చలు మాత్రమే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఇక ఆయా ప్రాంతాల్లో క్రమం తప్పకుండా పెట్రోలింగ్ కొనసాగుతోందని వారు తెలిపారు. గత సంవత్సరం జూన్ మధ్యలో హింసాత్మక ఘర్షణ తరువాత వాస్తవ నియంత్రణ రేఖ వెంట భారత, చైనా మిలిటరీల మధ్య సరిహద్దు వివాదం పెరిగింది. అయితే.. ప్రస్తుతం వివాదాలు లేకుండా సరిహద్దు సమస్యను పరిష్కరించుకొనేందుకే ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నట్లుగా కనిపిస్తుంది. కాగా.. మరోసారి చైనా దళాలు ఘర్షణకు దిగాయనే కథనాలతో స్పందించిన ఆర్మీ ఇది మరో వివాదం కాకముందే ఆ కథనాలను ఖండించినట్లుగా కనిపిస్తుంది.