సూడాన్ లో అగ్నిప్రమాదం: సజీవ దహనమైన 23 మంది కార్మికుల్లో భారతీయులు!

  • Edited By: veegamteam , December 4, 2019 / 06:44 AM IST
సూడాన్ లో అగ్నిప్రమాదం: సజీవ దహనమైన 23 మంది కార్మికుల్లో భారతీయులు!

సూడాన్ దేశంలోని బహ్రీ పట్టణంలోని కోబర్ నైబర్‌హుడ్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని సలోమీ సిరామిక్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో 23 మంది సజీవంగా దహనమయ్యారు. మరో 130 మంది తీవ్రంగా తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడిన 130 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

LPG గ్యాస్ ట్యాంకర్ పేలుడు వల్ల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
కాగా..ఈ ప్రమాదంలో మరణించినవారిలో భారతీయులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫ్యాక్టరీలో 50మందికి పైగా భారతీయులు పనిచేస్తున్నారు. 

కాగా ప్రమాదం తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం (డిసెంబర్ 3) జరిగిన ఈ ఘటనలో మరణించిన భారతీయుల గురించి సుడాన్ లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.