Indonesia volcano erupted: ఇండోనేషియాలో భారీ అగ్నిపర్వతం పేలింది…

ఇండోనేషియా దేశంలోని అనక్ క్రాకటోవా భారీ అగ్నిపర్వతం శుక్రవారం ఒక్కసారిగా పేలింది.పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గా పేరొందిన ఇండోనేషియా, ఆగ్నేయాసియా ద్వీపసమూహాల్లో తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు సంభవిస్తుంటాయి....

Indonesia volcano erupted: ఇండోనేషియాలో భారీ అగ్నిపర్వతం పేలింది…

Indonesia volcano erupted

Indonesia volcano erupted:ఇండోనేషియా దేశంలోని అనక్ క్రాకటోవా భారీ అగ్నిపర్వతం శుక్రవారం ఒక్కసారిగా పేలింది.పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గా పేరొందిన ఇండోనేషియా, ఆగ్నేయాసియా ద్వీపసమూహాల్లో తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు సంభవిస్తుంటాయి. ఈ భారీ అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది, భారీగా బూడిదను వెదజల్లింది. పేలిన అగ్నిపర్వతం నుంచి లావా మూడు కిలోమీటర్ల మేర ప్రవహించిందని అధికారులు చెప్పారు.

Hyderabad, Delhi airfares Hike : ఒడిశా రైలు ప్రమాదం తర్వాత విమాన టికెట్ల ధరలు మూడు రెట్లు పెంపు

1883వ సంవత్సరంలో క్రకటోవా పర్వతం విస్ఫోటనం తర్వాత ఏర్పడిన బిలం నుంచి అగ్నిపర్వత ద్వీపం గత శతాబ్దం ప్రారంభంలో సముద్రం నుంచి ఉద్భవించింది. ఇది చరిత్రలో అత్యంత ఘోరమైన, అత్యంత విధ్వంసకరమైన విస్ఫోటనమని అధికారులు చెప్పారు.అనక్ క్రకటోవా అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న లావా సుమత్రా దీవులను వేరు చేసే జలసంధిపై దట్టమైన బూడిదను వెదజల్లింది.

IIT Kanpur research over heart attacks: కరోనా అనంతరం యువతలో గుండెపోటుకు కారణాలపై పరిశోధనలు

అగ్నిపర్వతం పేలుడు ఎత్తు 3వేల నుంచి 10వేల అడుగులు ఉందని క్రాకటోవా మానిటరింగ్ స్టేషన్ నుండి అధికారి డెనీ మార్డియోనో చెప్పారు. అగ్నిపర్వతం యొక్క బిలం నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించవద్దని డెనీ ప్రజలను హెచ్చరించారు.

Nirmala Sitharaman: బెంగళూరులో నిరాడంబరంగా నిర్మలాసీతారామన్ కుమార్తె వివాహం

2018వ సంవత్సరంలో ఈ పర్వత బిలం పాక్షికంగా కూలిపోయింది. ఒక పెద్ద విస్ఫోటనం సముద్రంలోకి జారిపోయి భారీ భాగాలను పంపింది. దీనివల్ల వచ్చిన సునామీతో 400 మందికి పైగా మరణించగా, వేలాది మంది గాయపడ్డారు.ఇండోనేషియా దేశంలో 130 క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. దేశంలోని అగ్నిపర్వతం ఏది ఎప్పుడు పేలుతుందో తెలియని పరిస్థితుల్లో జనం బిక్కుబిక్కుమంటూ జీవనం వెళ్లదీస్తున్నారు.