IIT Kanpur research over heart attacks: కరోనా అనంతరం యువతలో గుండెపోటుకు కారణాలపై పరిశోధనలు

కరోనా మహమ్మారి అనంతరం యుక్తవయసులో ఉన్న వారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు.యువతీ, యువకులు జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా, మైదానంలో ఆటలు ఆడుతుండగా, వ్యాయామం చేస్తుండగా,వేడుకల్లో డాన్స్ చేస్తుండగానే ఉన్నట్టుండి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణిస్తున్నారు....

IIT Kanpur research over heart attacks: కరోనా అనంతరం యువతలో  గుండెపోటుకు కారణాలపై  పరిశోధనలు

Heart Attacks during Physical Activities

IIT Kanpur research over heart attacks: కరోనా మహమ్మారి అనంతరం యుక్తవయసులో ఉన్న వారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు.యువతీ, యువకులు జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా, మైదానంలో ఆటలు ఆడుతుండగా, వ్యాయామం చేస్తుండగా,వేడుకల్లో డాన్స్ చేస్తుండగానే ఉన్నట్టుండి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. వ్యాయామం చేస్తుండగా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య ఇటీవల అనూహ్యంగా పెరిగింది. దీంతో శారీరక శ్రమలో నిమగ్నమైన వారు గుండెపోటు పెరుగుదల కేసులను సమీక్షించడానికి కాన్పూర్ ఐఐటీ సమగ్ర పరిశోధన చేపట్టింది.

Bageshwar Baba:మత మార్పిడులకు వ్యతిరేకంగా బాగేశ్వర్ బాబా సంచలన ప్రకటన

గత రెండు సంవత్సరాలుగా ఆకస్మిక గుండెపోటుత మరణిస్తున్న మధ్య వయస్కులు, టీనేజ్ యువత సంఖ్య పెరగడంపై తరచూ సోషల్ మీడియాలో వైరల్ వీడియోల్లో చూశాం. ఈ సంఘటనల్లో ఆకస్మిక గుండెపోటుకు ఖచ్చితమైన కారణాన్ని కనుగొనలేక వైద్య నిపుణులను అబ్బురపరిచాయి.దీనిని దృష్టిలో ఉంచుకుని కాన్పూర్ ఐఐటీ పరిస్థితిని సమీక్షించడానికి సమగ్ర పరిశోధన ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఈ సంస్థ ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థలతో కలిసి పరిశోధనలు చేయనుంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్డియాలజిస్టులు, పరిశోధకులను ఆహ్వానించనుంది.

Cyclone Biparjoy To Intensify: బిపర్‌జాయ్ తుపాన్ మరింత తీవ్రం..ఐఎండీ హెచ్చరిక

గుండెపోటుకు సంబంధించిన ముందస్తు సంకేతాలను గుర్తించేందుకు ప్రత్యేక గుర్తింపు వ్యవస్థను కూడా పరిశోధకులు అభివృద్ధి చేయనున్నారు.కాన్పూర్‌ ఐఐటీలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న గంగ్వాల్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ శారీరక శ్రమల సమయంలో గుండెపోటుకు గల కారణాలను గుర్తించే ప్రయత్నానికి నాయకత్వం వహిస్తోంది. ఈ వ్యవస్థ గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉన్న వ్యక్తులను అప్రమత్తం చేయగలదు. ఈ సిస్టమ్ అధునాతన ఎంఆర్ఐ, ఈసీజీ స్కాన్‌ల డేటా ఆధారంగా కార్డియో ఎలక్ట్రోఫిజియాలజీ సిమ్యులేటర్‌ని ఉపయోగించనుంది.

16వేల గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్.. గుండెపోటుతో మృతి

కాన్పూర్ ఐఐటీ, సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తో కలిసి ఈ పరిశోధనలు సాగించనున్నాయి. ఇంజనీరింగ్ లేదా ఏదైనా శాస్త్రీయ విభాగాల్లో పీహెచ్డీ అర్హత ఉన్న వైద్యులు,శాస్త్రవేత్తలకు ఆహ్వానాలు పంపించారు. జూన్ 22 వతేదీ నాటికి రీసెర్చ్ టీమ్ ఎంపికకు సంబంధించిన రివ్యూ ప్రక్రియ పూర్తవుతుంది.కాన్పూర్ క్రికెట్ గ్రౌండులో నడుస్తున్నపుడు ఓ యువకుడు గుండెపోటుకు గురై మరణించాడు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ నగరంలో ఓ సెక్యూరిటీ గార్డు భోజనం చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యాడు.

Tunisian coast boats capsized:ట్యూనీషియా తీరంలో 3 పడవలు బోల్తా..ఐదుగురి మృతి, పలువురి గల్లంతు

మహారాష్ట్రలోని నాందేడ్‌లో బంధువుల పెళ్లి వేడుకలో ఓ యువకుడు డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలి క్షణాల్లోనే గుండెపోటుకు గురై మృతి చెందాడు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ పలువురు యువకులు సైతం గుండెపోటుతో మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో శాస్త్ర్రవేత్తలు, హృద్రోగ నిపుణులు అసలు దీనికి కారణాలేమిటో కనుగొని, గుండెపోటు వచ్చే ముందు సంకేతాలను గుర్తించి, అప్రమత్తం చేసే వ్యవస్థను కూడా రూపొందించనున్నారు.