Bageshwar Baba:మత మార్పిడులకు వ్యతిరేకంగా బాగేశ్వర్ బాబా సంచలన ప్రకటన

Bageshwar Baba:మత మార్పిడులకు వ్యతిరేకంగా బాగేశ్వర్ బాబా సంచలన ప్రకటన

Bageshwar Baba

Bageshwar Baba against conversion: దేశంలో సాగుతున్న మత మార్పిడులకు వ్యతిరేకంగా బాగేశ్వర్ బాబా సంచలన ప్రకటన చేశారు.(against conversion) బాగేశ్వర్ ధామ్‌కు చెందిన పీఠాధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి హిందూ మతంపై ఒక పుస్తకాన్ని రాయనున్నట్లు ప్రకటించారు. సనాతన ధర్మాలతోపాటు హిందూ ధర్మంపై తన అభిప్రాయాన్ని ఈ పుస్తకంలో రాస్తానని చెప్పారు. బాగేశ్వర్ ధామ్‌కు చెందిన పీఠాధీశ్వర్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి లవ్ జిహాద్, మత మార్పిడి గురించి కూడా గళం విప్పారు.మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌కు చేరుకున్న బాబా బాగేశ్వర్(Bageshwar Baba).. మత మార్పిడులను నిషేధించాలంటూ డిమాండ్ చేశారు.

Fire Breaks out at Hospital: ఢిల్లీ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..20 మంది నవజాత శిశువుల తరలింపు

హిందూ మతంపై ఓ పుస్తకం రాస్తానని, ఈ పుస్తకాన్ని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు బాగేశ్వర్ బాబా తెలిపారు.తాను త్వరలో రోజువారీ పనుల నుంచి కొంత విరామం తీసుకుని ఏకాంతంలో కూర్చొని ఈ పుస్తకాన్ని రాస్తానని బాబా చెప్పారు. పుస్తకం చదవడం ద్వారా విద్యార్థులు, ప్రజలు హిందూ మతం అంటే ఏమిటో తెలుసుకోగలుగుతారని బాబా పేర్కొన్నారు. హిందూ మతం అంటే ఏమిటనే ప్రశ్న తరచూ తలెత్తుతోందని, ఇటీవల ఈ విషయం కేరళ స్టోరీ చిత్రంలో కూడా చర్చకు వచ్చిందన్నారు.

Cyclone Biparjoy To Intensify: బిపర్‌జాయ్ తుపాన్ మరింత తీవ్రం..ఐఎండీ హెచ్చరిక

అందుకే తాను హిందూ మతం అంటే ఏమిటో ప్రజలకు చెప్పడానికి పుస్తకాన్ని త్వరలో విడుదల చేస్తానని చెప్పారు. భారతదేశం ఇప్పటికే హిందూ దేశమని, దానిని అధికారికంగా ప్రకటించాల్సి ఉందని కూడా ఆయన అన్నారు.ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తే మత మార్పిడులు జరగకుండా కఠిన చట్టం చేస్తామని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చెప్పారు.