Instagram Model Photoshoot : తండ్రి శవం పక్కనే కూతురు ఫొటోషూట్..ఇన్​స్టాగ్రామ్​ మోడల్ పై నెటిజన్లు ఫైర్

తండ్రి అంత్యక్రియలను ఫొటోషూట్​ కోసం ఉపయోగించుకుంది ఓ మోడల్. తండ్రి చనిపోయాడనే బాధే లేకుండా అతని మృతదేహం వద్ద సెక్సీ ఫోటోషూట్ చేసింది. తండ్రి శవపేటిక వద్ద పలు పోజుల్లో ఫొటోలు దిగి

Instagram Model Photoshoot : తండ్రి శవం పక్కనే కూతురు ఫొటోషూట్..ఇన్​స్టాగ్రామ్​ మోడల్ పై నెటిజన్లు ఫైర్

Insta2

Instagram Model Photoshoot తండ్రి అంత్యక్రియలను ఫొటోషూట్​ కోసం ఉపయోగించుకుంది ఓ మోడల్. తండ్రి చనిపోయాడనే బాధే లేకుండా అతని మృతదేహం వద్ద సెక్సీ ఫోటోషూట్ చేసింది. తండ్రి శవపేటిక వద్ద పలు పోజుల్లో ఫొటోలు దిగి ఇన్​స్టాగ్రామ్​లో పెట్టింది. అయితే ఫాలోవర్లు మరియు నెటిజన్ల తీవ్ర విమర్శలతో చివరకు ఆ ఫొటోలతో పాటు అకౌంట్​నే డిలీట్​ చేసేయాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది.

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామీ సిటీకి చెందిన జేన్ రివేరా(20) ఒక టిక్ టాక్ స్టార్. కొంచెం నేమ్, ఫేమ్ రావడంతో అమ్మడు మోడల్ గా కూడా కొనసాగుతుంది. ఫ్యాషన్​, ట్రావెలింగ్​కు చెందిన పోస్టులతో ఆమె పేరు సంపాదించుకుంది 20ఏళ్ల రివెరాకు చాలా మంది ఫాలోవర్లే ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 84వేల మంది, టిక్ టాక్ లో 3లక్షల మంది ఫాలోవర్లున్నారామెకు. అయితే ఆర్మీలో పనిచేసి చాలా కాలం కిందటే రిటైర్డ్ అయిన రివేరా తండ్రి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ అక్టోబర్-11న కన్నుమూశారు. ఉన్నదాంట్లో ఘనంగానే అంత్యక్రియలు జరిపించారు. అయితే రివేరా మాత్రం తన తండ్రి చావును పబ్లిసిటీ స్టంట్ గా వాడుకుంది. ఓ పార్టీకి వెళితే ఎలా ముస్తాబు అవుతామో.. అచ్చం అలాంటి డ్రెస్ నే ధరించి తండ్రి మృతదేహాం పక్కన నిలబడి సెక్సీ పోజులతో ఫోటోలకు రెడీ అయిపోయింది రివేరా. తండ్రి శవపేటిక వద్ద వివిధ పోజుల్లో స్టిల్స్​ దిగి వాటిని ఇన్​స్టాగ్రామ్​లో అప్లోడ్​ చేసింది.

తండ్రి శవం ముందు ఫొటోషూట్ చిత్రాలను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ #dadless అనే హ్యాష్‌ట్యాగ్‌‌తో జేన్ ఇలా రాసింది. నా సీతాకోక చిలుక ఎగిరిపోతుంది.. నీ ఆత్మకు శాంతి కలగాలి నాన్నా.. రెస్ట్ ఇన్ పీస్ అంటూ ఆ ఫొటోలను పోస్ట్ చేసింది రివేరా. అయితే తండ్రికి తుదివీడ్కోలు ఘట్టంలో రివేరా చేసిన పనినే అందరూ అసహ్యించుకుంటున్నారు. మిగతా విషయాలలో అమ్మడిని సపోర్ట్ చేసిన ఆమె ఫాలోవర్స్ .. ఈ విషయంలో మాత్రం విమర్శలు చేస్తున్నారు. తండ్రి అంత్యక్రియలను ఫొటోషూట్​గా మార్చేశావా? అంటూ నెటిజన్లు రివేరాపై మండిపడ్డారు.

ఇంత బాధలో ఉన్నా కూడా నీకు ఫోటో షూట్ అవసరమా? అని కొందరు.. మరి దారుణం ఇది అని మరికొందరు రివేరా తీరుపై విమర్శలు గుప్పించారు. ఫొటోలు వెంటనే డిలీట్​ చేయాలని డిమాండ్​ చేశారు. అయితే ఇవేమి పట్టించుకోని రివేరా ..తాను చేసిన దానిలో తప్పేముంది అంటూ ఎదురు ప్రశ్నించింది. చివరకు నెటిజన్ల విమర్శలకు తట్టుకోలేక ఆ ఫొటోలను డిలీట్​ చేసేసింది రివెరా. ఈ ఘటనతో రివెరా ఫాలోవర్ల సంఖ్య భారీ మొత్తంలో పడిపోయింది.

లక్షల కొద్దీ కామెంట్లు వస్తుండటంతో ఆ తర్వాత కొద్దిరోజులకు మొత్తం అకౌంట్​నే క్లోజ్ చేసింది రివేరా. అయితే తనను వెతుక్కుంటూ వచ్చిన కొందరికి మాత్రం రివేరా సావధానంగా సమాధానాలు చెబుతోందట. నాన్నంటే తనకు చాలా ఇష్టమని, మోడలింగ్ లో రాణించాలని ఎప్పుడూ దీవించేవారని, ఆయన లేని లోటును ఫీలవ్వకుండా ఉండేందుకే #dadless కాన్సెప్ట్ తో ఫొటో షూట్ చేశానని జేన్ రివేరా చెబుతోంది.

ALSO READ Prashant Kishore: మోడీ ఓడినా బీజేపీ పవర్ దశాబ్దాల పాటు తగ్గదంతే – ప్రశాంత్ కిశోర్