Instagram : మార్క్ జుకర్ బెర్గ్‌కు కొత్త టెన్షన్.. వారి కోసం వేల కోట్లు ఖర్చు

ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌ బెర్గ్‌కు పెద్ద కష్టమే వచ్చి పడింది. ఇన్ స్టాగ్రామ్ యూజర్లు తగ్గిపోతున్నారు. ఇతర సోషల్ మీడియా సైట్స్ ను ఆశ్రయిస్తున్నారు. చేజారిపోతున్న యూజర్లను చూ

Instagram : మార్క్ జుకర్ బెర్గ్‌కు కొత్త టెన్షన్.. వారి కోసం వేల కోట్లు ఖర్చు

Instagram

Instagram : ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌ బెర్గ్‌కు పెద్ద కష్టమే వచ్చి పడింది. ఇన్ స్టాగ్రామ్ యూజర్లు తగ్గిపోతున్నారు. ఇతర సోషల్ మీడియా సైట్స్ ను ఆశ్రయిస్తున్నారు. చేజారిపోతున్న యూజర్లను చూసి జుకర్ బెర్గ్ కు టెన్షన్ మొదలైంది. వెంటనే అలర్ట్ అయ్యాడు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు.

మ్యాటర్ ఏంటంటే… ఫేస్‌బుక్‌ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్‌ హౌగెన్‌.. ఇన్ స్టాగ్రామ్ పై బాంబు పేల్చింది. టీనేజీ అమ్మాయిలపై ఇన్ స్టాగ్రామ్ చెడు ప్రభావాన్ని చూపిస్తుందని ఆరోపించింది. ‘ప్రొటెక్టింగ్‌ కిడ్స్‌ ఆన్‌లైన్’ పేరుతో నివేదికను తయారు చేసింది. ఆ నివేదిక వెలుగులోకి రావడంతో జుకర్ బర్గ్ కు తలనొప్పిగా మారింది. ఆ నివేదిక కారణంగా ఇన్‌స్ట్రాగ్రామ్‌ యూజర్లు ఇతర సోషల్‌ మీడియా సైట్స్‌ను వినియోగించేందుకు మొగ్గుచూపుతున్నారు. అందుకే చేజారిపోతున్న యూజర్లను అట్రాక్ట్‌ చేసేందుకు, కొత్త యూజర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేయాలని జుకర్ బర్గ్ నిర్ణయించాడు.

Android Phones Hack: మీ ఫోన్‌లో వైరస్ ఇలా గుర్తించండి.. వెంటనే తీసేయండి..!

ఇన్‌స్టాగ్రామ్‌ ఈ ఏడాది వార్షిక యాడ్‌ బడ్జెట్‌లో టీనేజ్‌ యూజర్స్‌ కోసం సుమారు 390 మిలియన్‌ డాలర్లను (ఇండియన్‌ కరెన్సీలో రూ. 29,26,36,50,000.00) యాడ్స్‌ రూపంలో ఖర్చు చేసేందుకు జుకర్ బెర్గ్ సిద్ధమయ్యారు.

అదే సమయంలో ఇన్‌ స్ట్రాగ్రామ్‌పై వెల్లువెత్తుతున్న విమర్శలు ఇతర సోషల్‌ మీడియా నెట్‌ వర్క్‌లకు వరంగా మారాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఇన్‌ స్ట్రాగ్రామ్‌ నుంచి 35శాతం మంది యూజర్లు స్నాప్‌ చాట్‌కు, 30శాతం మంది యూజర్లు టిక్‌ టాక్‌ వైపు మొగ్గుచూపారని నివేదికలు చెబుతున్నాయి. వారిని నియంత్రించేందుకు యాడ్స్‌పై భారీ ఖర్చు పెట్టనున్నారు జుకర్ బెర్గ్. ముఖ్యంగా టీనేజ్‌ యూజర్లు తగ్గిపోవడంపై ఇన్‌ స్ట్రాగ్రామ్‌ ముప్పుగా భావిస్తోంది. అందుకే యాడ్స్‌ లేదా, ఇతర మార్కెటింగ్‌ స్ట్రాటజీల్లో 13 నుంచి 15 ఏళ్ల వయస్సున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే 13 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న కిడ్స్‌ యూజర్‌ బేస్‌ పెంచుకునేందుకు ‘ఇన్ స్టాగ్రామ్ కిడ్స్’ పేరుతో యాప్‌ను బిల్డ్‌ చేస్తోంది.

Samantha : సినిమా చేయాలంటే కొత్త కండిషన్లు పెడుతున్న సమంత.. విడాకుల ఎఫెక్ట్?

ఫేస్ బుక్ కి చెందిన ఇన్ స్టాగ్రామ్ కు టీనేజ్ యూజర్లే బలం. ఇన్ స్టా గ్రోత్ లో వారిది కీలక పాత్ర. ఇన్ స్టా యూజర్లలో 40శాతానికి పైగా 22ఏళ్ల వయసు వారే. అమెరికాలో టీన్స్ 50శాతానికి పైగా సమయాన్ని ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ పైనే స్పెండ్ చేస్తారు.

అయితే, ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్లను పోటీదారులకు కోల్పోయింది. 35% మంది టీనేజర్లు స్నాప్‌చాట్ తమ అభిమాన సోషల్ మీడియా యాప్ అని, 30% మంది తమ అభిమాన యాప్ టిక్‌టాక్ అని చెప్పారు. కేవలం 22% మంది టీనేజర్లు మాత్రమే తమ అభిమాన సోషల్ మీడియా నెట్ వర్క్ ఇన్‌స్టాగ్రామ్‌ అని తెలిపారు.

”మేము మా మొత్తం మార్కెటింగ్ బడ్జెట్‌ని టీనేజ్‌ల వైపు కేంద్రీకరించడం నిజం కానప్పటికీ, టీనేజ్ మా ముఖ్యమైన కమ్యూనిటీలలో ఒకటి అని మేము చాలాసార్లు చెప్పాము. ఎందుకంటే వారు ట్రెండ్‌ సెట్ చేస్తారు. వారు మా మార్కెటింగ్ వ్యూహంలో భాగం కావడం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు” అని ఇన్ స్టాగ్రామ్ ప్రతినిధి చెప్పారు. ఇన్ స్టాగ్రామ్.. టీనేజీల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఓ నివేదిక వచ్చింది. ఆ నివేదిక కారణంగా యూజర్లు చేజారిపోతున్నారు. దీనిపై ఇన్‌స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మోసేరి స్పందించారు. ఇన్ స్టాగ్రామ్ టీనేజ్ మానసిక ఆరోగ్యంపై చూపే ప్రభావం చాలా తక్కువగా ఉందని తాను నమ్ముతున్నానని చెప్పారు.