China-Taiwan conflict: ప్రపంచ సమాజం దీటుగా స్పందించాలి.. చైనా యుద్ధ సన్నాహాలపై తైవాన్ విజ్ఞప్తి

చైనా చేపట్టిన యుద్ధ విన్యాసాలపై తైవాన్ విదేశాంగ మంత్రి మండిపడుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ సమాజం తైవాన్ కు మద్దతు తెలుపుతుందని తాము ఆశిస్తున్నామని పేర్కొన్నారు. చైనా బాధ్యతారాహిత్య చర్యలకు, బెదిరింపులకు ముగింపు పలికేలా ప్రపంచ సమాజం స్పందించాలని కోరారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు, స్థిరత్వం కొనసాగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. తైవాన్ చుట్టూ సముద్ర జలాల్లో చైనా చేపట్టిన సైనిక విన్యాసాలు అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమ దేశ హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.

China-Taiwan conflict: ప్రపంచ సమాజం దీటుగా స్పందించాలి.. చైనా యుద్ధ సన్నాహాలపై తైవాన్ విజ్ఞప్తి

China-Taiwan conflict

China-Taiwan conflict: చైనా చేపట్టిన యుద్ధ విన్యాసాలపై తైవాన్ విదేశాంగ మంత్రి మండిపడుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ సమాజం తైవాన్ కు మద్దతు తెలుపుతుందని తాము ఆశిస్తున్నామని పేర్కొన్నారు. చైనా బాధ్యతారాహిత్య చర్యలకు, బెదిరింపులకు ముగింపు పలికేలా ప్రపంచ సమాజం స్పందించాలని కోరారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు, స్థిరత్వం కొనసాగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. తైవాన్ చుట్టూ సముద్ర జలాల్లో చైనా చేపట్టిన సైనిక విన్యాసాలు అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమ దేశ హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.

కొన్ని రోజులుగా చైనా చేపడుతోన్నచర్యలు ప్రాంతీయ భద్రత, శాంతికి ముప్పు కలిగించేలా ఉన్నాయని చెప్పారు. దీనిపై తైవాన్ స్పందనను తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోనూ చైనా చర్యలు అంతర్జాతీయ రవాణా, వాణిజ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని చెప్పారు. చైనా పాల్పడుతోన్న బాధ్యతారాహిత్య చర్యలను తైవాన్ ఖండిస్తోందని అన్నారు. చైనా ఆర్మీ పాల్పడుతోన్న చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని చెప్పారు. తైవాన్‌లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ పర్యటనను సాకుగా చూపెడుతూ చైనా ఈ చర్యలకు పాల్పడుతోందని, నిజానికి డ్రాగన్ దేశ ఉద్దేశం అది కాదని అన్నారు.

కొన్నేళ్ళుగా తైవాన్ ఆర్మీపై చైనా బెదిరింపులకు పాల్పడుతోందని చెప్పారు. వాటిని పెంచుకుంటూ వస్తోందని తెలిపారు. తైవాన్ జలసంధి తమదేనని చైనా బహిరంగంగానే ప్రకటించిందని అన్నారు. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు కొనసాగించే హక్కు తైవాన్ కు ఉందని చెప్పారు. కాగా, తైవాన్ తమ భూభాగమని చెప్పుకుంటోన్న చైనా ఇప్పటికే అనేక సార్లు యుద్ధ విమానాలతో దుందుడుకు చర్యలకు పాల్పడింది. నాన్సీ ఫెలోసీ తైవాన్ లో పర్యటించిన అనంతరం ఆ చర్యలకు మరింత ముమ్మరం చేసింది. దీనిపై అమెరికా కూడా స్పందిస్తూ చైనాకు హెచ్చరిక చేసింది. అయినప్పటికీ, చైనా తన చర్యలను ఆపడం లేదు.

Telangana Cabinet: ఎల్లుండి తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేసీఆర్