Pelosi’s husband: ‘నాన్సీ పెలోసీ ఎక్కడ ఉంది?’ అని అరుస్తూ ఆమె భర్తపై దుండగుడు సుత్తితో దాడి.. తీవ్రగాయాలు

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ భర్త పాల్ పెలోసీ(82) పై ఓ వ్యక్తి సుత్తితో దాడి చేశాడు. నాన్సీ పెలోసీ ఇంట్లోకి చొరబడిన ఆ దుండగుడు ‘నాన్సీ ఎక్కడ ఉంది?’ అంటూ అరుస్తూ ఈ దాడి చేశాడని అధికారులు చెప్పారు. నిన్న తెల్లవారు జామున అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలోని నాన్సీ పెలోసీ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. నాన్సీ పెలోసీ భర్తపై దాడికి పాల్పడ్డ ఆ దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Pelosi’s husband: ‘నాన్సీ పెలోసీ ఎక్కడ ఉంది?’ అని అరుస్తూ ఆమె భర్తపై దుండగుడు సుత్తితో దాడి.. తీవ్రగాయాలు

Pelosi’s husband: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ భర్త పాల్ పెలోసీ(82) పై ఓ వ్యక్తి సుత్తితో దాడి చేశాడు. నాన్సీ పెలోసీ ఇంట్లోకి చొరబడిన ఆ దుండగుడు ‘నాన్సీ ఎక్కడ ఉంది?’ అంటూ అరుస్తూ ఈ దాడి చేశాడని అధికారులు చెప్పారు. నిన్న తెల్లవారు జామున అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలోని నాన్సీ పెలోసీ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. నాన్సీ పెలోసీ భర్తపై దాడికి పాల్పడ్డ ఆ దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అతడు ఎందుకు దాడి చేశాడన్న విషయంపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పాల్‌ పెలోసికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. పాల్ పెలోసీపై దాడి జరిగిన సమయంలో నాన్సీ పెలోసి వాషింగ్టన్‌లో ఉన్నారు. వారి ఇంట్లోకి దుండగుడు ఎలా ప్రవేశించాడన్న విషయంపై కూడా అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. వచ్చే నెల 8న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి.

ఈ సమయంలో ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. తన భర్తపై దాడి జరిగిందని తెలుసుకున్న నాన్సీ పెలోసీ నిన్న రాత్రి శాన్‌ ఫ్రాన్సిస్కో చేరుకున్నారు. దుండగుడి పేరు డేవి డిపేప్ (42) అని అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని అధికారులు చెప్పారు. పాల్ పెలోసీ తల, చేతులకు తీవ్రగాయాలయ్యాయని ఆయనకు సర్జరీ కూడా జరిగిందని వివరించారు. నాన్సీ పెలోసీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్ చేసి పరామర్శించారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..