పాకిస్తాన్ పై అర్థరాత్రి సర్జికల్ స్ట్రైక్స్

పాకిస్తాన్ పై అర్థరాత్రి సర్జికల్ స్ట్రైక్స్

Iran పాకిస్తాన్ మీద మరో దేశం సర్జికల్ స్ట్రైక్ చేసింది. బలూచ్ టెర్రరిస్టులు కిడ్నాప్ చేసిన తమ రివల్యూషనరీ గార్డ్ ని విడిపించేందుకు పాక్ భూభాగంలో ఇరాన్ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టినట్లు సమాచారం. పాకిస్తాన్ లో భూభాగంలోపల చేపట్టిన ఈ ఆపరేషన్ లో ఇరాన్ ఎలైట్ రివల్యూషనరీ గార్డ్స్(IRGC)ఇప్పటివరకు తమ ఆర్మీకి చెందిన ఇద్దరు గార్డ్స్ ని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించుకోగలిగినట్లు తెలిసింది.

మూడేళ్ల క్రితం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి దాచిపెట్టిన ఇద్దరు ఇరాన్ సైనికులను సర్జికల్ స్ట్రైక్ చేసి విడిపించుకుంది. పాకిస్తాన్‌లో ఉన్న తమ ఇంటెలిజెన్స్ విభాగం అందించిన సమాచారం మేరకు కిడ్నాప్‌నకు గురైన సైనికులను ఉగ్రవాదులు ఎక్కడ దాచిపెట్టారో తెలుసుకుని వారి ప్రాంతంలోనే దాడి చేసింది. మిలటరీ విభాగానికి ఏ మాత్రం అందకుండా వారి దేశం లోపలికి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేసి తమ వారిని విడిపించుకుంది ఇరాన్. సర్జికల్ స్ట్రైక్‌లో, ఉగ్రవాదుల డెన్‌కు కాపాలాగా ఉన్న కొందరు పాక్ ఆర్మీ అధికారులు చనిపోయినట్టు తెలిసింది.

పాకిస్తాన్‌పై జరిపిన సర్జికల్ స్ట్రైక్ విజయవంతం అయిందని ఇరాన్ ప్రకటించింది. మంగళవారం రాత్రి ఈ “విజయవంతమైన ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్” చేపట్టినట్లు IRGC ఓ ప్రకటనలో పేర్కొంది.సర్జికల్ స్ట్రైక్ చేసిన ఇరాన్ సైనికులు క్షేమంగా తమ దేశానికి కూడా వచ్చేశారని ఆ ప్రకటనలో తెలిపింది.

కాగా,అక్టోబర్-16,2018న పాకిస్తాన్ కి చెందిన ఇరానియన్ సున్నీ తీవ్రవాద గ్రూప్ “జైష్ అల్ అదల్(ఆర్మీ ఆఫ్ జస్టిస్)”..దాదాపు 12మంది ఇరాన్ గార్డ్స్ ని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ లోని సిస్టాన్-పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ఫ్రావిన్స్ బోర్డర్ పాయింట్ మిర్జావేహ్ వద్ద వీరిని కాడ్నాప్ చేసి పాకిస్తాన్ లో వేరో చోటుకి తరలించారు. అయితే, ఈ ఘటన అనంతరం మిలటరీ అధికారులు ఓ జాయింట్ కమిటీగా ఏర్పడి రెండు దేశాల మధ్య సయోధ్యను కుదిర్చారు. కిడ్నాప్ చేసిన వారిలో ఐదుగురిని 2018 మే 15న రిలీజ్ చేశారు. కిడ్నాప్ కు గురైన మరో ఐదుగురు గార్డ్స్ ని గతేడాది నవంబర్ లో ఇరాన్ కాపాడింది.ఇప్పుడు మిగిలిన ఇద్దరు సైనికులను రక్షించినట్టు ఇరాన్ ప్రకటించింది.

జైష్ అల్ అదుల్ అనేది మిలటరీ ఆర్గనైజేషన్. దీన్ని ఇరాన్ ఉగ్రవాద సంస్థగా గతంలో ప్రకటించింది. దీనికి పాకిస్తాన్ ఆర్మీ సహకారం ఉందని ఇరాన్ నిఘావర్గాలు చెప్పాయి.ఇరాన్ మీద ఈ సంస్థ పెద్ద ఎత్తున ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. ఆగ్నేయ ఇరాన్‌లో సున్నీ ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ సంస్థ తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇరాన్ సైనికులతో పాటు ప్రజల మీద కూడా పలుమార్లు ఉగ్రదాడులు చేసింది.