George W. Bush : అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డ‌బ్ల్యూ బుష్ హ‌త్యకు కుట్ర

ఇరాకీ ఇంటెలిజెన్స్‌తో పాటు ఇస్లామిక్ స్టేట్‌లో ప‌నిచేసిన వ్యక్తుల్ని తీసుకువ‌చ్చే ప్రయ‌త్నం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ స్టేట్ అధినేత అబూ బాక‌ర్ అల్ బ‌గ్దాదికి బంధువున‌ని అతడు చెప్పుకున్నాడు.

George W. Bush : అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డ‌బ్ల్యూ బుష్ హ‌త్యకు కుట్ర

George W Bush

George W. Bush : అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డ‌బ్ల్యూ బుష్ హ‌త్యకు కుట్ర పన్నిన కేసులో ఇరాక్‌కు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు షిహ‌బ్ అహ్మద్ ప్రస్తుతం అమెరికాలో రాజ‌కీయ ఆశ్రయం పొందుతున్నాడు. డ‌ల్లాస్‌, టెక్సాస్‌లో ఉన్న బుష్ లొకేష‌న్లను షిహ‌బ్ రెక్కీ వేసిన‌ట్లు తెలుస్తోంది.

తుపాకులు, భ‌ద్రతా ద‌ళాల దుస్తులు, వాహ‌నాల‌ను ఎలా తెచ్చుకోవాల‌న్న దానిపై షిహ‌బ్ ఆరా తీసిన‌ట్లు అనుమానిస్తున్నారు. జార్జ్ బుష్‌ను చంపేందుకు న‌లుగురు ఇరాకీల‌ను అమెరికా ర‌ప్పించే ప్రయ‌త్నం చేసిన‌ట్లు అతడిపై అరోప‌ణ‌లు ఉన్నాయి. దీనికి సంబంధించి ఓహియో కోర్టులో ఎఫ్‌బీఐ అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది.

America Gun Culture : అమెరికాలో రోజుకు 53 మందిని బలి తీసుకుంటున్న తుపాకి

ఇరాకీ ఇంటెలిజెన్స్‌తో పాటు ఇస్లామిక్ స్టేట్‌లో ప‌నిచేసిన వ్యక్తుల్ని తీసుకువ‌చ్చే ప్రయ‌త్నం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ స్టేట్ అధినేత అబూ బాక‌ర్ అల్ బ‌గ్దాదికి బంధువున‌ని అతడు చెప్పుకున్నాడు.