Divorce : పాట నచ్చలేదని భార్యకు విడాకులిచ్చిన కొత్త పెళ్లికొడుకు

ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లలో మేళ తాళాలతో పాటు వచ్చిన బంధువులను ఉత్సాహ పరచటానికి డీజే పెట్టటం పరిపాటయ్యింది. దానికి తగ్గట్టుగా పెళ్లికి వచ్చిన వారే కాక  నూతన  వధూవరులు కూడా డ్యాన్స్ చే

Divorce : పాట నచ్చలేదని భార్యకు విడాకులిచ్చిన కొత్త పెళ్లికొడుకు

Divorce case

Divorce : ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లలో మేళ తాళాలతో పాటు వచ్చిన బంధువులను ఉత్సాహ పరచటానికి డీజే పెట్టటం పరిపాటయ్యింది. దానికి తగ్గట్టుగా పెళ్లికి వచ్చిన వారే కాక  నూతన  వధూవరులు కూడా డ్యాన్స్ చేసి ఉత్సాహ పరచటం మామూలైపోయింది.

ఇటీవల డుగ్గు డుగ్గు మంటూ… బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తామామ….అనే పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఇరాక్ లో జరిగిన ఒక పెళ్లిలో,  పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ కు  పెళ్లి కొడుకు అక్కడే విడాకులు ఇచ్చేసిన ఘటన వెలుగు చూసింది.

ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో   ఓ యువకుడి  పెళ్లి జరుగుతోంది. పెద్దల సమక్షంలో జరుగుతున్న వివాహ వేడుకల్లో భాగంగా  ఆరోజు రాత్రి జరిగిన కార్యక్రమంలో ఒక పాటకు పెళ్లి కూతురు డ్యాన్స్ చేసింది. ఆపాట “అర్ధం…నీపై నేను ఆధిపత్యం చెలాయిస్తా.. నేను చెప్పినట్టే నువ్వు నడుచుకోవాలి.. నేను అహంకారిని” అని అర్ధం వస్తుంది.

దీంతో కోపగించుకున్న వరుడు, అతని కుటుంబ సభ్యులు, బంధువులు పాటకు అభ్యంతరం చెప్పారు. పెళ్లి కూతురు కుటుంబంతో వాగ్వాదానికి దిగారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి అక్కడి కక్కడే వధువుకు విడాకులు ఇచ్చేశారు. దీంతో ఈ విషయం అక్కడ చర్చనీయాంశం అయ్యింది.

ఇది దేశంలోనే అత్యంత వేగవంతమైన విడాకుల కేసు అని స్ధానిక వార్తా సంస్ధలు తెలిపాయి. పెళ్లిలో పాటల కారణంగా విడాకులు తీసుకున్న మొదటి కేసు కాదు ఇది.  గతంలోనూ పెళ్ళిలో ఇదే పాట పాడటం వల్ల జోర్డాన్ వ్యక్తి తన భార్యనుంచి విడాకులు తీసుకున్నాడు. లెబనాన్ లోనూ ఇలాంటి ఘటనే జరిగింది.