WhatsApp : వాట్సాప్‌కు ప్రభుత్వం బిగ్ షాక్.. రూ.1,948 కోట్ల జరిమానా

ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ కు భారీ షాక్ తగిలింది. ఐర్లాండ్ ప్రభుత్వం వాట్సాప్ కు భారీ జరిమానా విధించింది. ఈయూ గోపత్యా చట్టాలు, డేటా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఐర్లాండ్‌కు చెందిన

WhatsApp : వాట్సాప్‌కు ప్రభుత్వం బిగ్ షాక్.. రూ.1,948 కోట్ల జరిమానా

Whatsapp

WhatsApp : ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ కు భారీ షాక్ తగిలింది. ఐర్లాండ్ ప్రభుత్వం వాట్సాప్ కు భారీ జరిమానా విధించింది. ఈయూ గోపత్యా చట్టాలు, డేటా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఐర్లాండ్‌కు చెందిన డేటా ప్రైవసీ కమిషనర్‌(DPC) 225 మిలియన్‌ యూరోలను జరిమానాగా విధించింది. మన దేశ కరెన్సీ ప్రకారం సుమారు రూ.1,950 కోట్లు. వ్యక్తుల డేటాను ఇతర ఫేస్ బుక్ కంపెనీలతో పంచుకునే విషయంలో పారదర్శకత పాటించకపోవడంతో ఈ జరిమానా వేసినట్లు డీపీసీ తెలిపింది.

No Smoking : వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్నా స్మోకింగ్ చేయకూడదు.. ఉద్యోగులకు కొత్త రూల్

వాట్సాప్ వినియోగదారులకు వారి డేటా ఎలా ప్రాసెస్ చేస్తామో అన్న విషయాన్ని వారికి తెలియజేసేలా తగిన సమాచారం ఇవ్వకుండా వాట్సాప్‌ నిబంధనలను ఉల్లంఘించిందని డీపీసీ చెప్పింది. ఈ అంశంపై 2018లో విచారణ ప్రారంభించి తాజాగా జరిమానా విధించింది. జరిమానాపై వాట్సాప్‌ స్పందించింది. భారీ స్థాయిలో జరిమానా వేయడాన్ని తప్పుబట్టింది. దీనిపై తాము అప్పీల్‌కు వెళతామంది.

సురక్షితమైన, ప్రైవేట్ సేవను అందించడానికి వాట్సాప్ కట్టుబడి ఉంది. మేము అందించే సమాచారం పారదర్శకంగా, సమగ్రంగా ఉండేలా పనిచేశాము. దానిని అలాగే కొనసాగిస్తాము అని వాట్సాప్ ప్రతినిధి చెప్పారు.

Typhus Vaccine : పేన్లతో ఏ వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేసారో తెలుసా??

2018 లో ప్రజలకు మేము అందించిన పారదర్శకతకు సంబంధించి ఈరోజు నిర్ణయంతో మేము విభేదిస్తున్నాము. జరిమానాలు పూర్తిగా అసమానంగా ఉన్నాయి అని వాట్సాప్ ప్రతినిధి అన్నారు.

EU గోప్యతా వాచ్‌డాగ్ యూరోపియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ జూలైలో ఐరిష్ ఏజెన్సీకి అనేక సూచనలు ఇచ్చింది. టెక్ జెయింట్‌లకు సంబంధించిన కేసుల్లో నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకున్నందుకు, ఏవైనా ఉల్లంఘనలకు తగినంత జరిమానా విధించనందుకు దాని సహచరుల విమర్శలను పరిష్కరించడానికి. ఐరిష్ రెగ్యులేటర్ ఫేస్‌బుక్ దాని అనుబంధ సంస్థలైన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌పై 14 ప్రధాన విచారణలను గత సంవత్సరం చివరినాటికి తెరిచింది.