Pakistan Army: చైనాతో మైత్రిపై పాక్‌కు కనువిప్పు?.. వ్యూహాన్ని మార్చుకుని పాశ్చాత దేశాలవైపు ఆర్మీ చూపు

యూకేలోని సీనియర్ అధికారులు, రక్షణ, నిఘా అధికారులను కమర్ జావేద్ బజ్వా కలిశారు. ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో పాక్ కు మిత్రదేశం చైనా ఎలాంటి ఆర్థిక సాయమూ చేయట్లేదు. చైనా-పాకిస్థాన్ ఎకానమిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టులో పెట్టుబడులు కూడా పాక్ ఆర్థిక వ్యవస్థను కాపాడడంలో విఫలమయ్యాయి. నిజానికి ఇప్పుడు పాకిస్థాన్ కు చైనా ఎలాంటి నిధులూ ఇవ్వట్లేదు. చైనా అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశాల జాబితాలోకి పాక్ వెళుతోంది. చైనాపై ఆధారపడకుండా పాశ్చాత దేశాలపై ఆధారపడితే బాగుంటుందని పాక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాశ్చాత దేశాల్లో పర్యటించాలని బజ్వా భావిస్తున్నారు. ఆయా దేశాలతోనే మైత్రిని కొనసాగించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

Pakistan Army: చైనాతో మైత్రిపై పాక్‌కు కనువిప్పు?.. వ్యూహాన్ని మార్చుకుని పాశ్చాత దేశాలవైపు ఆర్మీ చూపు

Pakistan Army

Pakistan Army: ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు వేస్తోన్న పాకిస్థాన్‌కు కనువిప్పు కలుగుతున్నట్లుంది. చైనాను నమ్ముకుంటే లాభం లేదని పాక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, తమ దేశ వ్యూహాత్మక విధానాలను మార్చుకుంటోంది. తాజాగా, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా యూకేలోని శాండ్‌హర్స్ట్ లో ఉండే రాయల్ మిలిటరీ అకాడమీని సందర్శించారు. పాసింగ్-అవుట్ పరేడ్ హాజరయ్యారు. ఈ గౌరవం అందుకున్న పాకిస్థాన్ తొలి ఆర్మీ చీఫ్ బజ్వానే.

అలాగే, యూకేలోని సీనియర్ అధికారులు, రక్షణ, నిఘా అధికారులను కమర్ జావేద్ బజ్వా కలిశారు. ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో పాక్ కు మిత్రదేశం చైనా ఎలాంటి ఆర్థిక సాయమూ చేయట్లేదు. చైనా-పాకిస్థాన్ ఎకానమిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టులో పెట్టుబడులు కూడా పాక్ ఆర్థిక వ్యవస్థను కాపాడడంలో విఫలమయ్యాయి. నిజానికి ఇప్పుడు పాకిస్థాన్ కు చైనా ఎలాంటి నిధులూ ఇవ్వట్లేదు. చైనా అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశాల జాబితాలోకి పాక్ వెళుతోంది.

అంతేగాక, పాశ్చాత దేశాల నుంచి ఆర్థిక ఆంక్షలను పాకిస్థాన్ ఎదుర్కొంటోంది. ఉగ్రవాదానికి నిధులు సమకూరకుండా చేయడంలో విఫలమైనందుకు పాక్ పై ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ ఆర్మీ నిధుల కొరతతో బాధపడుతోంది. దీంతో, ఇందుకోసం చైనాపై ఆధారపడకుండా పాశ్చాత దేశాలపై ఆధారపడితే బాగుటుందని పాక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాశ్చాత దేశాల్లో పర్యటించాలని బజ్వా భావిస్తున్నారు. ఆయా దేశాలతోనే మైత్రిని కొనసాగించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

China-Taiwan conflict: చెప్పినట్టుగానే మళ్ళీ తైవాన్ చుట్టూ పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు ప్రారంభించిన చైనా