China-Taiwan conflict: చెప్పినట్టుగానే మళ్ళీ తైవాన్ చుట్టూ పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు ప్రారంభించిన చైనా

తైవాన్‌ చుట్టూ మళ్ళీ యుద్ధ విన్యాసాలు చేపడతామంటూ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే చైనా ఆ చర్యలు ప్రారంభించింది. చైనా యుద్ధ విమానాలు పెద్ద ఎత్తన తైవాన్ చుట్టూ చక్కర్లు కొట్టాయి. దీంతో తైవాన్ విషయంలో మరోసారి కలకలం చెలరేగుతోంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ ఇటీవల పర్యటించడంతో చైనా కొన్ని రోజుల పాటు సైనిక విన్యాసాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఉద్రిక్తత చల్లారకముందే యూఎస్ కాంగ్రెస్ సభ్యుల బృందం నిన్న తైవాన్‌కు చేరుకుంది. రెండు రోజుల పర్యటనను కొనసాగిస్తోంది.

China-Taiwan conflict: చెప్పినట్టుగానే మళ్ళీ తైవాన్ చుట్టూ పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు ప్రారంభించిన చైనా

India exercising with Russia

China-Taiwan conflict: తైవాన్‌ చుట్టూ మళ్ళీ యుద్ధ విన్యాసాలు చేపడతామంటూ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే చైనా ఆ చర్యలు ప్రారంభించింది. చైనా యుద్ధ విమానాలు పెద్ద ఎత్తన తైవాన్ చుట్టూ చక్కర్లు కొట్టాయి. దీంతో తైవాన్ విషయంలో మరోసారి కలకలం చెలరేగుతోంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ ఇటీవల పర్యటించడంతో చైనా కొన్ని రోజుల పాటు సైనిక విన్యాసాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఉద్రిక్తత చల్లారకముందే యూఎస్ కాంగ్రెస్ సభ్యుల బృందం నిన్న తైవాన్‌కు చేరుకుంది. రెండు రోజుల పర్యటనను కొనసాగిస్తోంది.

సెనేటర్ ఈడీ మార్కే నేతృత్వంలో ప్రతినిధులు జాన్ గరమెండీ, అలన్ లోవెన్తల్, డాన్ బెయర్, అనుమువా అమట కొలెమన్ రడెవాగెన్ ఈ పర్యటలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై తైవాన్ తో చర్చలు జరుపుతున్నారు. దీంతో చైనా మరోసారి యుద్ధ విన్యాసాలు చేపడతామని కొన్ని గంటల ముందే స్పష్టం చేసింది. చెప్పినట్లుగానే నేడు యుద్ధ విమానాలను పంపింది.

తైవాన్ చుట్టూ ఈ విన్యాసాలు కొనసాగుతున్నాయి. తైవాన్ తమ భూభాగమని వాదిస్తోన్న చైనా వీలుచిక్కితే ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలని భావిస్తోంది. చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో డ్రాగన్ దేశం శాంతి కోసం కృషి చేయాలని అమెరికా సూచిస్తోంది.

Asia Cup 2022: అవును.. ఆసియా కప్‌ను టీమిండియానే గెలుచుకుంటుంది: పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్