Israel Prime Minister: ఇజ్రాయెల్‌ నూతన ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌

ఇజ్రాయెల్ ప్రధానిగా యామినా పార్టీ అధ్యక్షుడు నఫ్తాలీ బెన్నెట్‌ (49) ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఎనిమిది పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు బెన్నెట్.

Israel Prime Minister: ఇజ్రాయెల్‌ నూతన ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌

Israel Prime Minister

Israel Prime Minister: ఇజ్రాయెల్ ప్రధానిగా యామినా పార్టీ అధ్యక్షుడు నఫ్తాలీ బెన్నెట్‌ (49) ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఎనిమిది పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు బెన్నెట్. గత రెండుళ్లుగా ఇజ్రాయెల్ పార్లమెంటుకు నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మెజారిటీ రాలేదు. నాలుగు ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో అతి పెద్ద పార్టీ అయిన లికుడ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ దేశ అధ్యక్షుడు ఆదేశించాడు.

దీంతో లికుడ్ పార్టీ అధ్యక్షుడు బెంజిమెన్ నెతన్యాహు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 120 మంది సభ్యులుగల ఇజ్రాయెల్‌ పార్లమెంటులో ప్రభుత్వం నిలబడాలి అంటే 61 మంది సభ్యుల బలం అవసరం. కానీ నెతన్యాహు పార్టీకి 30 మంది సభ్యుల బలమే ఉంది. దీంతో ఆయన బాల నిరూపణలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే 17 మంది సభ్యులతో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న యెష్‌ అటిడ్‌ ను ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాల్సిందిగా అధ్యక్షడు కోరాడు. దీంతో ఆ పార్టీ అధినేత లాపిడ్‌, యామినా పార్టీ అధినేత నఫ్తాలీ బెన్నెట్‌ తో మంతనాలు జరిపారు.

వీరిద్దరి మధ్య ఒప్పందం కుదరడంతో మొదట 2023 సెప్టెంబర్ వరకు నఫ్తాలీ బెన్నెట్‌ ప్రధానిగా కొనసాగనున్నారు. ఆ తర్వాత మిగతా రెండేళ్లు లాపిడ్‌ ప్రధాని పదవిలో ఉంటారు. ఎనిమిది భిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై మాజీ ప్రధాని నెతన్యాహు స్పందించారు. ఈ ప్రమాదకరమైన ప్రభుత్వాన్ని పడగొట్టి.. మళ్లీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా పనిచేస్తానని నెతన్యాహు పేర్కొన్నారు.