మాస్క్ తీయకుండానే..తినొచ్చు..తాగొచ్చు

  • Published By: madhu ,Published On : May 20, 2020 / 12:13 AM IST
మాస్క్ తీయకుండానే..తినొచ్చు..తాగొచ్చు

కరోనా వైరస్ ఎంతో మందిని ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ వైరస్ కారణంగా ఎంతో మంది చనిపోయారు. వైరస్ కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. కానీ..దీనికి వ్యాక్సిన్ మాత్రం ఇంతవరకు కనిపెట్టలేకపోతున్నారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో పలు దేశాలు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతొక్కరూ మాస్క్ కంపల్సరీ ధరించాలని నిబంధనలు పెడుతున్నాయి. అయితే..మాస్క్ వల్ల చాలా మంది తిప్పలు పడుతున్నారు.

తిన్నాలన్నా..తాగాలన్నా..నోటి లోపటికి ఏదైనా..పంపించాలన్నా..తప్పనిసరిగా..మాస్క్ తీయాల్సిన అవసరం ఉంటుంది. కానీ…అలా చేయకుండానే..ఎంచక్కా..తినేయొచ్చు..అంటున్నారు ఇజ్రాయెల్ దేశానికి చెందిన తయారీదారులు.చేతిలో ఉన్న హ్యాండ్ రిమోట్ ను నొక్కగానే స్లాట్ తెరుచుకొనే కొత్త  మాస్క్‌కు ను మార్కెట్ లోకి వదిలారు. దీనిని ఎవిటిపస్ పేటెంట్స్, ఇన్వెన్షన్ సహాధ్యక్షుడు అసఫ్ గిటెలిస్ తయారు చేశారు.

మాస్క్ తీయకుండానే..ఆహారం తీసుకోవచ్చని వెల్లడిస్తున్నారు. ఇప్పటికే తాము పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, త్వరలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామంటున్నారు. దీని ధర రూ. 60 నుంచి రూ. 200 వరకు ఉండొచ్చన్నారు. మాస్క్ ను హ్యాండ్ రిమోట్ తో తెరుచుకొనేలా చేయడం, లేకపోతే..ఫోర్క్ ను నోటి వద్దకు తీసుకరాగానే..ఆటోమెటిక్‌‌గా మాస్క్ స్లాట్ తెరుచుకుంటుందన్నారు. అయితే..మాస్క్ పని తీరుపై అక్కడి ప్రజలు భిన్నంగా స్పందిస్తున్నారు. ఐస్ క్రీం, ఇతర ఆహార పదార్థాలు తినడం కష్టమంటున్నారు. 

Read: రూ.2కే కరోనా టెస్టింగ్ స్వాబ్స్… స్వదేశీ ఉత్పత్తితో 90శాతం తగ్గిన ఖర్చు