Human Embryo : కృత్రిమ పిండం.. స్త్రీ, పురుషుల కలయిక లేకుండానే పిండాన్ని సృష్టించారు, ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు అద్భుతం

మహిళ గర్భంలో కాకుండా ప్రయోగశాలలో పండాన్ని సృష్టిచండం విశేషం. రెహోవాతో లోని వీజ్ మన్ ఇన్ స్టిట్యూల్ ఆఫ్ సైన్స్ కు చెందిన పరిశోధకుల బృందం ఈ విప్లవాత్మకమైన ఆవిష్కరణ చేసింది.

Human Embryo : కృత్రిమ పిండం.. స్త్రీ, పురుషుల కలయిక లేకుండానే పిండాన్ని సృష్టించారు, ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు అద్భుతం

Human Embryos

Human Embryo Israeli Scientists : ఒక జీవి ప్రాణం పోసుకోవాలంటే అండం, శుక్రకణం తప్పక కలవాల్సిందే. అయితే ఏవో కొన్ని ఏక కణ జీవుల్లో మాత్రమే ఇందుకు మినహాయింపు ఉంటుంది. మనిషి పుట్టుకకు మాత్రం అండం, శుక్రకణం తప్పక కలవాల్సిందే. కానీ ఇకపై వాటితో అవసరం లేకుండానే పిల్లలను పుట్టించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. జీవకణం లేకుండానే మానవ పిండాన్ని సృష్టించారు. కృత్రిమ పిండాన్ని తయారు చేశారు. ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు.

స్త్రీ, పురుషుల కలయికతో సంబంధం లేకుండానే పిండాన్ని సృష్టించారు. అది కూడా మహిళ గర్భంలో కాకుండా ప్రయోగశాలలో పండాన్ని సృష్టిచండం విశేషం. రెహోవాతో లోని వీజ్ మన్ ఇన్ స్టిట్యూల్ ఆఫ్ సైన్స్ కు చెందిన పరిశోధకుల బృందం ఈ విప్లవాత్మకమైన ఆవిష్కరణ చేసింది. మనిషి మూల కణాన్ని ఉపయోగించి అచ్చం మానవ పిండాన్ని పోలిన ఆకారాన్ని సృష్టించారు.ఈ పిండం ప్రయోగశాలలో 14 రోజులపాటు పెరిగింది.

Artificial intelligence: అద్భుతాన్ని ఆవిష్కరించిన AI.. మొట్టమొదటిసారిగా డిజిటల్ అవతార్‌ సాయంతో మాట్లాడగలిన పక్షవాతానికి గురైన మహిళ

తల్లి గర్భంలో పిండం రూపుదాల్చే ప్రారంభం దశలో ఎలా ఉంటుందో ఈ కృత్రిమ పిండం కూడా అచ్చం అలాగే ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. సాధారణంగా గర్భం దాల్చినప్పుడు మొదటి నెలలోనే సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆ సమయంలో రగ్భ విచ్చిత్తి అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. దీంతో అసలు ఆ సమయంలో పిండం పెరుగుదల ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఇజ్రాయెల్ పరిశోధకులు భావించారు.

పరిశోధకులు తొలుత ఎలుకలపై ఈ అధ్యయనం చేసి సఫలం చెందారు. అనంతరం ప్రయోగశాలలో పిండం రూపొందించేందుకు పూనుకున్నారు. మూల కణాలను సేకరించి వాటిపై పరిశోధనలు చేశారు.
ఓ కణం పిండంగా మారాలంటే ప్లాసెంట, మెంబ్రెన్, యెల్క్ శాక్, అమ్నియోటిక్ శాక్ తదితరాలు అవసరం అవుతాయి. దీని కోసం మూల కణానికి ముందుగానే పిండంగా మారేలా ప్రోగ్రామింగ్ చేశారు.

Brain Cancer : మెదడు క్యాన్సర్‌కు ప్రమాద కారకాలు, లక్షణాలు, నివారణలు !

మూల కణం పిండంగా మారేందుకు నాలుగు రకాల కణాలను రసాయనాలను ఉపయోగించి ప్రేరేపితం చేశారు. వాటిలో మొదటిది ఎపిబ్లాస్ట్ కణాలు. ఇవి పిండంగా మారేందుకు అవసరం అవుతాయి.
రెండోది ట్రోపోబ్లాస్ట్ కణాలు.. ఇవి ప్లాసెంటాను ఉత్పత్తి చేస్తాయి. మూడోది హైపోబ్లాస్ట్ కణాలు.
ఇవి పిండానికి అవసరమైన యోల్క్ శాక్ (పొర)ను రూపొందించేందుకు దోహదపడతాయి.
నాలుగోది మెస్కోడెర్మ్ కణాలు.. ఇవి అమ్నియోటిక్ శాఖగా రూపాంతరం చెందుతాయి.

అయితే 120 రకాల కణాలను పరస్పరం మిక్స్ డ్ చేయగా, వాటిలో 1 శాతం మాత్రమే సఫలమై
పిండంగా రూపాంతరం చెందింది. అనంతరం మానవుల తరహాలోనే గర్భ దారణ పరీక్ష చేసేందుకు వీలుగా హార్మోన్ ను సైతం ఈ పిండం విడుదల చేసినట్లు పరిశోధకులు వెల్లడించారు. 9-12 వారాల వయసు కలిగిన దాన్నే పిండంగా పేర్కొంటారని ప్రొఫెసర్ హన్నా పేర్కొన్నారు.

Artificial Intelligence : కృత్రిమ మేధస్సుతో మానవాళికి ముప్పు!

ఆ సమయంలోనే మానవ అవయవాలు, అన్ని రకాల వ్యవస్థలు తయారై మానవ రూపం సంతరించుకుంటుంది. అప్పుడే దాన్ని పిండంగా పేర్కొంటారని తెలిపారు. అయితే ఈ మోడల్ సృష్టి విరుద్ధం. కాగా, ఈ మోడల్ ను ఉపయోగించి మానవ అవయవాలను ఉత్పత్తి చేసుకోవచ్చని వెల్లడించారు.