800 year old Mummy : 800 ఏళ్లనాటి మమ్మీని ప్రేమిస్తున్నా..క్షణమైనా వదిలి ఉండలేనంటూ..బ్యాగులో పెట్టుకుని తిరుగుతున్న యువకుడు

800 ఏళ్లనాటి మమ్మీని ప్రేమిస్తున్నానని దాన్ని వదిలి ..క్షణమైనా ఉండలేంటూ బ్యాగులో పెట్టుకుని తిరుగుతున్నాడు ఓ యువకుడు.

800 year old Mummy : 800 ఏళ్లనాటి మమ్మీని ప్రేమిస్తున్నా..క్షణమైనా వదిలి ఉండలేనంటూ..బ్యాగులో పెట్టుకుని తిరుగుతున్న యువకుడు

Peru man who kept 800 Old Years mummy Girlfriend

800 year old Mummy : మమ్మీలు అంటే ఠక్కున గుర్తుకొచ్చే దేశం ఈజిప్టు. వందల వేల ఏళ్లనాటి మమ్మీల (mummy)కు ప్రసిద్ధి చెందింది ఈజిప్టు. ఇక్కడి సమాధులు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఈజిప్టులో మమ్మీల కథ పక్కనపెడితే ఓ 26 ఏళ్ల యువకుడు మాత్రం ఏకంగా 800ల ఏళ్లనాటి మమ్మీని బ్యాగులో పెట్టుకుని తిరుగుతున్నాడు. పైగా ఆ మమ్మీగర్ల్ ఫ్రెండ్ అని దానిని నేను ప్రేమిస్తున్నానని దాన్ని వదిలి ఉండలేంటున్నాడు. సదరు యువకుడు చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు.

పెరూలో 26 ఏళ్ల జూలియో సీజర్ బెర్మెజో అనే యువకుడు వద్ద ఓ మమ్మీ ఉందని తెలిసిన పోలీసులు అతడిని ప్రశ్నించారు. అతను మమ్మీలను అక్రమంగా అమ్ముతున్నాడని ఆరోపణలో జూలియోను ప్రశ్నించారు. దానికి అతను 30 ఏళ్లుగా ఈ మమ్మీ మా ఇంట్లోనే ఉంటోందని మానాన్న నాకు ఈ మమ్మీని ఇచ్చాడని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడని ఈ మమ్మీని నేను ప్రేమిస్తున్నాను..ఆరాధిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అతని సమాధానం విన్న పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. మమ్మీని ఒక ఐసోథర్మల్ బ్యాగ్‌లో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నానని చెప్పాడు. అతని సమాధానం విన్న పోలీసులకు ఓ క్షణంపాటు వారికి ఏం చేయాలో అర్థం కాలేదు.

కాగా..పునో ప్రాంతానికి చెందిన సీజర్ బెర్మెజో కుటుంబం ఫుడ్, సరుకుల రవాణా చేస్తుండేది. అదే వారి వృత్తిగా ఉండేవారు. 30 ఏళ్ల క్రితం బెర్మెజో తండ్రి జువానిటా అనే మమ్మీని తనతో తీసుకొచ్చి ఇంట్లో ఉంచాడు. దాన్ని కుటుంబ సభ్యులంతా జాగ్రత్తగా చూసుకునేవారు. కొంతకానికి బెర్మెజో చనిపోయాడు. చనిపోయే ముందు మమ్మీని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడట. దానింతో తనకు తన తండ్రి తర్వాత వారసత్వంగా బెర్మెజో ఆ మమ్మీని చూసుకుంటున్నాడు.

జూలియో ఎక్కడికి వెళ్లినా ఆ మమ్మీ బ్యాగును కూడా తీసుకెళుతుంటాడు. అలా బ్యాగులో ఆ మమ్మీని పెట్టుకుని తిరుగుతుంటాడు. దాన్ని తన స్నేహితులకు కూడా చూపిస్తుంటాడు. ఈక్రమంలో కొన్ని రోజుల క్రితం జూలియో తన స్నేహితులతో కలిసి ఉండటాన్ని గమనించిన పెట్రోలింగ్ పోలీసులు వారి వద్దకొచ్చారు. జూలియో వద్ద ఉన్న పెద్ద బ్యాగు అనుమానాస్పదంగా కన్పించింది. దీంతో పోలీసులు ఆ బ్యాగు చూపించమని అడిగారు.దానికి జూలియో ఏమాత్రం జంకకుండా దాన్ని విప్పి చూపించాడు. అంతే బ్యాగులో ఉన్న మమ్మీన్ని చూసి పోలీసులు ఖంగుతున్నారు. దాని గురించి ప్రశ్నించగా మమ్మీ గురించి చెప్పుకొచ్చాడు జూలియో. కానీ పోలీసులు మాత్రం అతను మమ్మీ (Mummy)ని అక్రమంగా విక్రయిస్తున్నాడనే ఆరోపణలో అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.

అనంతరం విచారించగా ఈ మమ్మీని నేను అమ్మటానికి తీసుకురాలేదని..నా స్నేహితులకు చూపించటానికి తీసుకొచ్చానని.ఇది ఎప్పునుంచో మా ఇంట్లోనే ఉంటుందని నేను దాన్ని పక్కనే పెట్టుకుని నిద్రపోతా. జాగ్రత్తగా చూసుకుంటా. ఈ మమ్మీ నా ప్రేయసి’’ అని చెప్పుకొచ్చాడు. అతను పదే పదే అవే మాటలు చెప్పేసరికి పోలీసులు తలలు పట్టుకున్నారు. అతనికి పలు విధాలుగా నచ్చ చెప్పి బలవంతంగా పురావస్తుశాఖ అధికారులకు అప్పగించారు.

ఆ మమ్మీని పరిశీలించిన సైంటిస్టులు అది 600 నుంచి 800ఏళ్ల క్రితానికి చెందినది తెలిపారు.బెర్మెజో అమ్మాయిగా భావిస్తున్న ఆ మమ్మీ మహిళ కాదని 45 ఏళ్ల పురుషుడిదని చెప్పి పెద్ద ట్విస్టే ఇచ్చారు పరిశోధకులు. అలా ఆ మమ్మీ జూలియో తండ్రి ఎక్కడినుంచి తీసుకొచ్చాడు? ఎందుకు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇంత కాలంగా ఉంచుకున్నారు? వారికి ఏమైనా మానసకి సమస్యలు ఉన్నాయా? అనే పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.