Jaishankar In Saudi: సౌది అరేబియా రాజుతో సమావేశమైన విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్
రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌది అరేబియాకు జయశంకర్ వెళ్లారు. కాగా, శనివారం ఆయన సౌదీలోని భారత సంతతి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడారు. ఉక్రెయిన్ సంక్షోభం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వేంగా వృద్ధి చెందుతుందని, ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందనే ఆశాభావం తమకుందని ఈ సందర్భంగా జయశంకర్ అన్నారు.

Jaishankar calls upon Saudi Arabian Crown Prince Mohammed bin Salman in Jeddah
Jaishankar In Saudi: సౌది అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్‌తో భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్.జయశంకర్ సమావేశమయ్యారు. జెడ్డా నగరం వీరి సమావేశానికి వేదికైంది. ఇండియా, సౌది అరేబియా దేశాల మధ్య దౌత్య సంబంధాల గురించి సౌది రాజుతో మాట్లాడినట్లు జయశంకర్ తెలిపారు. ఈ విషయమై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘గౌరవనీయమైన హెచ్ఆర్హెచ్ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ను జెడ్డాలో కలుసుకోవడం చాలా సంతోషకరం. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ఆయనకు వివరించాను. ఈ విషయమై తన అభిప్రాయాల్ని పంచుకున్నందుకు ఆయనకు కృతజ్ణతలు’’ అని ట్వీట్ చేశారు.
దీనికి సౌది అరేబియా విదేశాంగ మంత్రి ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ను జయశంకర్ కలుసుకున్నారు. ఇండియా-సౌది అరేబియా భాగస్వామ్యం, దౌత్యంపై వీరు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ఇరు దేశాలకు సంబంధించిన రాజకీయ, భద్రత, సాంగీక, సాంస్కృతిక కమిటీలు సమావేశమయ్యాయి. ‘‘సౌది అరేబియా విదేశాంగ మంత్రి ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్‌తో మంచి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇరు దేశాల రాజకీయ, భద్రత, సాంగీక, సాంస్కృతిక కమిటీలు సమావేశమయ్యాయి’’ అని జయశంకర్ ట్వీట్ చేశారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌది అరేబియాకు జయశంకర్ వెళ్లారు. కాగా, శనివారం ఆయన సౌదీలోని భారత సంతతి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడారు. ఉక్రెయిన్ సంక్షోభం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వేంగా వృద్ధి చెందుతుందని, ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందనే ఆశాభావం తమకుందని ఈ సందర్భంగా జయశంకర్ అన్నారు.
YSR Kalyanamastu : కచ్చితంగా పదో తరగతి పాసవ్వాలి.. కల్యాణమస్తు పథకంపై మంత్రి బొత్స క్లారిటీ