సిగరెట్ అలవాటున్నవాళ్లకు ఉద్యోగాలివ్వరంట

  • Published By: venkaiahnaidu ,Published On : April 24, 2019 / 04:28 AM IST
సిగరెట్ అలవాటున్నవాళ్లకు ఉద్యోగాలివ్వరంట

సిగరెట్ తాగే అలవాటు ఉన్న ఫ్రొఫెసర్లు,టీచర్లకు ఓ జపాన్ యూనివర్శిటీ షాక్ ఇచ్చింది. స్మోకింగ్ అలవాటు ఉన్న వారిని ఫ్రొఫెసర్లు,టీచర్లుగా తమ యూనివర్శిటీలో నియమించుకోకూడదని నిర్ణయించింది.స్మోకర్లు విద్యారంగానికి పనికిరారని యూనివర్శిటీ అభిప్రాయపడింది. 2020 ఒలంపిక్స్ ముందు యాంటి స్మోకింగ్ క్యాంపెయిన్ లో భాగంగా యూనివర్శిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
సిగరెట్ తాగే ఎవరైనా టీచింగ్ స్టాఫ్ ని నియమించుకోవడం ఆపేశామని,అయితే ఉద్యోగాల్లో చేరే ముందు స్మోకింగ్ ఆపేస్తామని ప్రామిస్ చేసినవాళ్లకు ఉద్యోగవకాశం కల్పిస్తున్నట్లు నాగసాకి యూనివర్శిటీ ప్రతినిధి యుసూకి టకాకురా తెలిపారు.ఆగస్టు నుంచి క్యాంపస్ లో స్మోకింగ్ పై బ్యాన్ విధిస్తుందని,స్మోకింగ్ అలవాటు మానలేని వాళ్లకోసం ఓ క్లినిక్ కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు టకాకురా తెలిపారు.

ఉద్యోగులపై ఇలాంటి షరతు విధించిన మొట్టమొదటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని యూనివర్శిటీ ఇదేనని, 2020 సమ్మర్ గేమ్స్ సందర్భంగా గతేడాది టోక్స్ సిటీ గవర్నమెంట్ కఠినమైన యాంటీ స్మోకింగ్ రూల్స్ అమలుపరిచిన తర్వాత యూనివర్శిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. స్మోకర్ల స్వరంగా జపాన్ కి పేరుంది.స్మోకింగ్ ని అరికట్టడంలో జపాన్ ప్రభుత్వ కృషికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా తక్కువ రేటింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.చైనా,సౌత్ కొరియాలతో పోలిస్తే జపాన్ స్మోకింగ్ అరికట్టే విషయంలో వెనుకబడి ఉంది.