Kangaroo Kills Old Man : యజమానిపై దాడి చేసి చంపేసిన కంగారూ .. 86 ఏళ్లలో కంగారూ మనిషిని చంపటం ఇదే మొదటిసారి

తనను పెంచుకుంటున్న ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేసింది ఓ కంగారూ. ఓ కంగారూ మనషిని చంపడం 86 ఏళ్లలో ఇదే తొలిసారి.

Kangaroo Kills Old Man : యజమానిపై దాడి చేసి చంపేసిన కంగారూ .. 86 ఏళ్లలో కంగారూ మనిషిని చంపటం ఇదే మొదటిసారి

Kangaroo Kills 77-Year-Old Man

Updated On : September 13, 2022 / 11:45 AM IST

Kangaroo Kills 77-Year-Old Man : ఆహారం పెట్టి కడుపు నింపిన యజమానినే పొట్టనపెట్టుకుంటున్నాయి పెంపుడు జంతువులు. ఎంతో ముచ్చటపడి పెంచుకునే పెంపుడు జంతువులే మనుషుల పాలిట మృత్యుదేవతలుగా మారిని ఘటనలు చాలానే ఉన్నాయి. ఈక్రమంలో తనను పెంచుకుంటున్న ఓ వ్యక్తిని ఓ కంగారూ చంపేసింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని రెడ్‌మండ్‌లో ఆదివారం మధ్యాహ్నం (సెప్టెంబర్ 11,2022) జరిగిందీ ఘటనలో తనను పెంచుకుంటున్న 77 ఏళ్ల వృద్ధుడిని కంగారూదాడి చేసి చంపేసింది.

ఓ కంగారూ మనషిని చంపడం 86 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనించాల్సిన విషయం. కంగారూ దాడిలో తీవ్రంగా గాయపడిన 77 ఏళ్ల వృద్ధుడిని గమనించిన స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కానీ అంబులెన్స్ వచ్చేసరికి సదరు వృద్ధుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. అతనికి ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ సిబ్బంది వచ్చేసరికే బాధిత వృద్ధుడు ప్రాణాలు విడిచాడు. ఆ కంగారూకు ఏమైందో ఏమోగానీ యజమానిపై దాడి చేయటమేకాకుండా ఆ ఇంటికి వచ్చిన అంబులెన్స్ సిబ్బందిని వృద్ధుడు మృతదేహం వద్దకు రాకుండా అడ్డుకుంది. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. క్రూర జంతువులగా వ్యవహరిస్తున్న ఆ కంగారూతో తోటి మనుషులకు కూడా ప్రమాదం పొంచి ఉందని భావించిన పోలీసులు ఆ కంగారూని కాల్చి చంపేశారు.

పోలీసుల చేతిలో చనిపోయిన కంగారూ ఏ జాతికి చెందినదన్న విషయాన్ని నిర్ధారించలేదు. ఏడు అడుగులకు పైనే ఉన్న ఈ మగ కంగారూ 70 కేజీల బరువున్నట్టు చెప్పారు. ఆస్ట్రేలియాలో చివరిసారి 1936లో ఓ కంగారూ మనిషిని చంపేసింది. ఆ తర్వాత జరిగిన తొలి ఘటన ఇదేనని స్థానిక మీడియా తెలిపింది.

కాగా..న్యూ సౌత్‌వేల్స్‌లో ఇటీవల రెండు కుక్కలపై ఓ పెద్ద కంగారూ దాడి చేసింది. ఆ కంగారూ బారి నుంచి వాటిని రక్షించే ప్రయత్నం చేసిన 38 ఏళ్ల విలియం క్రూక్‌షాంక్‌పై కంగారూ దాడిచేసింది. ఈ ఘటనలో అతడి దవడ పగిలిపోయింది. తలకు గాయాలయ్యాయి. ఆ తర్వాత అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.