Covid-19: కరోనా చికిత్సకు కొత్త యాంటీ వైరల్..!

కరోనా మహమ్మారి విడతల వారీగా ప్రపంచం మీద దండెత్తుతుంటే.. వైద్య నిపుణులు శాస్త్రవేత్తలు వైరస్ ను అరికట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా.. మరోవైపు వైరస్ సోకిన వారిని మహమ్మారి నుండి త్వరితగతిన కోలుకునేలా చేసేందుకు రకరకాల డ్రగ్స్, యాంటీ బాడీస్ చికిత్సా విధానాలపై కూడా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.

Covid-19: కరోనా చికిత్సకు కొత్త యాంటీ వైరల్..!

Covid 19

Covid-19: కరోనా మహమ్మారి విడతల వారీగా ప్రపంచం మీద దండెత్తుతుంటే.. వైద్య నిపుణులు శాస్త్రవేత్తలు వైరస్ ను అరికట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా.. మరోవైపు వైరస్ సోకిన వారిని మహమ్మారి నుండి త్వరితగతిన కోలుకునేలా చేసేందుకు రకరకాల డ్రగ్స్, యాంటీ బాడీస్ చికిత్సా విధానాలపై కూడా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 2D డ్రగ్, మిక్సెడ్ కాక్టైల్ యాంటీబాడీస్ లాంటి విధానాలు, ఔషదాలు బయటకి రాగా ఇప్పుడు మరో ఔషధాన్ని కూడా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

అమెరికాలోని కన్సాస్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జీసీ376 అనే ప్రొటీజ్‌ ఇన్‌హిబిటర్‌ ఔషధాన్ని అభివృద్ధి చేశారు. ఇది వైరస్‌ పునరుత్పత్తిని అడ్డుకుంటుందని ఎలుకల్లో నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. పిల్లుల్లో తలెత్తే ప్రాణాంతక కరోనా ఇన్‌ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ప్రొటీజ్‌ ఇన్‌హిబిటర్లు అనేవి ఒకరకం యాంటీవైరల్‌ ఔషధాలుగా ఉన్నాయని.. ఇవి ఎంపిక చేసిన వైరల్‌ ఎంజైమ్‌లకు అతుక్కోవడం ద్వారా వైరస్‌ పునరుత్పత్తిని అడ్డుకుంటాయని కనుగొన్న శాస్త్రవేత్తలు జీసీ376 అభివృద్ధి తర్వాత కొవిడ్‌ మహమ్మారిపై ప్రయోగించాలని నిర్ణయించారు.

ఇందుకు అనుగుణంగా ఔషధాన్ని మార్చేందుకు డ్యూటరేషన్‌ అనే సాధనాన్ని అభివృద్ధి చేసి మార్పిడి చేసిన ఔషధాన్ని ఎలుకలపై పరీక్షించారు. మొదట ఈ జీవులకు కరోనా ఇన్‌ఫెక్షన్‌ కలిగించి ఒకరోజు తర్వాత ఈ ఔషధాన్ని ఇచ్చారు. ఇది మంచి ప్రభావం చూపినట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు ఊపిరితిత్తుల్లో వైరస్‌ పునరుత్పత్తిని తగ్గించినట్లు తేల్చారు. దీంతో ఇప్పుడు ఈ ఔషధాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సిద్ధమవుతున్నారు.