Hollywood Celebrity: విడాకులు తీసుకున్న భార్య వెంట పడుతున్న”సెలబ్రిటీ భర్త”

సెలబ్రిటీ కపుల్స్ కిమ్ కర్దాషియన్, కాన్యే వెస్ట్. హాలీవుడ్ టీవీ కార్యక్రమాలు, పాప్ సాంగ్స్ చూసే వారికి ఈపేర్లు సుపరిచితమే.

Hollywood Celebrity: విడాకులు తీసుకున్న భార్య వెంట పడుతున్న”సెలబ్రిటీ భర్త”

Kim Kanye

Hollywood Celebrity: వారిద్దరు సెలబ్రిటీ భార్యాభర్తలు. సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆ భార్యాభర్తలు హాలీవుడ్ బెస్ట్ సెలెబ్రెటీల్లో ఎప్పుడు టాప్ లిస్టులో ఉంటారు. ఏమైందో తెలియదు. ఉన్నటుండి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం భార్య ముందుగానే కోర్టుకెళ్లి విడాకులకు అప్లై చేయగా, కోర్ట్.. కొంత కాలవ్యవధి ఇచ్చింది. నెలలు గడిచాయి. ఇంతలో మనసు మార్చుకున్న భర్త, అవకాశం ఉంటే తిరిగి ఆమెనే భార్యగా పొందాలని చూస్తున్నాడు. నిత్యం ఆమె నామ జపం చేస్తూ ఎదురు చూస్తున్నాడు. ఆ సెలబ్రిటీ కపుల్స్ “కిమ్ కర్దాషియన్, కాన్యే వెస్ట్”. హాలీవుడ్ టీవీ కార్యక్రమాలు, పాప్ సాంగ్స్ చూసే వారికి ఈపేర్లు సుపరిచితమే.

కిమ్ కర్దాషియన్, కాన్యే వెస్ట్ లకు చాలా ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరిద్దరికి నలుగురు పిల్లలు ఉన్నారు. పాప్ సింగర్, రాపర్ గా.. కాన్యే వెస్ట్ కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. టీవీ నటిగా, వ్యాపారవేత్తగా కిమ్ ఎంతో సుపరిచితురాలు. అయితే కొన్నేళ్ల క్రితం కాన్యే వెస్ట్ ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడు. ఉన్న ఆస్తులు అమ్ముకుని, తీవ్ర అప్పుల్లో కూరుకుపోయాడు. దీంతో కొన్నాళ్ళు కుటుంబానికి దూరంగా ఉంటూ, కెరీర్ పై ఫోకస్ పెట్టాలనుకున్నాడు కాన్యే వెస్ట్. కానీ ఇంతలోనే భార్య విడాకులకు వెళ్ళింది. ఆవిషయం కోర్టులో ఉండగానే వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఇక్కడ కొసమెరుపేంటంటే ఇద్దరికీ ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయం, ప్రేమ ఉంది. కానీ కెరీర్ ను చక్కదిద్దుకునేందుకు మాత్రమే వీరు విడిపోయారు.

Also Read: Earphones washing machine: బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కోసం వాషింగ్ మెషిన్

కట్ చేస్తే లాక్ డౌన్ ముందు.. కాన్యే వెస్ట్.. ఒక “షూ బ్రాండ్”ను మొదలు పెట్టాడు. అది సూపర్ హిట్ అవడంతో మనోడి దశ తిరిగి మిల్లియన్ డాలర్లు వచ్చిపడ్డాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన సెలెబ్రిటీలలో కాన్యే వెస్ట్ టాప్ లిస్టులో ఉన్నాడు. దీంతో తన అప్పులన్నీ తీర్చేసిన కాన్యే, తిరిగి తన పాత లైఫ్ స్టైల్ ను ఫాలో అయిపోతున్నాడు. అయితే అన్నీ ఉన్నా తనకు.. ఇప్పుడు భార్య, పిల్లల ప్రేమను మిస్ అవుతున్నానంటూ తెగ బాధపడిపోతున్నాడు. దీంతో ఎలాగైనా మాజీ భార్య.. కిమ్ కర్దాషియన్ ను తిరిగి పొందేందుకు, ఆమె ప్రస్తుతం నివాసముంటున్న బంగ్లాకు అతిసమీపంలోనే కాన్యే వెస్ట్ కూడా $4.5 మిల్లియన్ డాలర్ల భారీ మొత్తం వెచ్చించి బంగ్లా కొన్నాడు. కిమ్ ఎప్పుడు, ఎక్కడికి వెళ్తుంది వంటి విషయాలన్నీ గమనిస్తున్న కాన్యే ఎలాగైనా ఆమెను తిరిగి పొందాలని ఎదురుచూస్తున్నాడు. కానీ కిమ్ మాత్రం మరో వ్యక్తితో చనువుగా ఉంటుంది. అయితే ఇదంతా గమనిస్తున్న అభిమానులు, హాలీవుడ్ ప్రేక్షకులు.. కిమ్ పై కాన్యే చూపిస్తున్న ప్రేమను చూసి ఆమె ఎప్పటికైనా తిరిగి అతని వద్దకు వస్తుందని అంటున్నారు.

Also Read: Amazon Year end sale: అమెజాన్ లో “ఇయర్ ఎండ్” డిస్కౌంట్ సేల్ లో టాప్ స్మార్ట్ ఫోన్స్