Earphones washing machine: బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కోసం వాషింగ్ మెషిన్

స్మార్ట్ ఫోన్ కొన్నాం కదాని బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కొంటే, ఇపుడు ఆ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కోసం వాషింగ్ మెషిన్ కొనాల్సి వస్తుంది.

Earphones washing machine: బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కోసం వాషింగ్ మెషిన్

Washingmachine

Earphones washing machine: టెక్నాలజీ రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతుంది. అదే సమయంలో కొంచెం విచిత్రంగానూ తయారవుతుంది. స్మార్ట్ ఫోన్ కొన్నాం కదాని బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కొంటే, ఇపుడు ఆ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కోసం వాషింగ్ మెషిన్ కొనాల్సి వస్తుంది. అవునూ, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ను క్లీన్ చేసుకునేందుకు ఒక వాషింగ్ మెషిన్ తయారు చేసాడో వ్యక్తి. దాని విశేషాలేంటో మీరే చూడండి.

అడ్వాన్స్డ్ టెక్నాలజీ పుణ్యమా అంటూ, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అందరికీ అందుబాటులోకి వచ్చాయి. రూ. 1000 అతి తక్కువ ధర నుంచి రూ. 30000 ఖరీదైన ఇయర్ ఫోన్స్ వరకు అన్ని వర్గాల వారికీ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆ పరికరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే, దుమ్ముధూళి, బాక్టీరియా చేరి చెవులకు హానికలిగించే ప్రమాదం ఉంది. దీంతో పాటు ఆపరికరాలు పనిచేకుండా పోతాయి. ప్రతిసారి ఇయర్ ఫోన్స్ క్లీన్ చేసుకోవడం సాధ్యపడని పని. అందుకే, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కోసమంటూ ప్రత్యేకంగా ఓ వాషింగ్ మెషిన్ తయారు చేసాడో వ్యక్తి. కార్డ్‌లాక్స్ ఇయర్‌బడ్స్ వాషర్(Cardlax EarBuds Washer)గా పిలువబడే ఈ అతిబుల్లి వాషింగ్ మెషిన్, ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. USB-C కేబుల్ తో పనిచేసే ఈ విచిత్ర వాషింగ్ మెషిన్లో, Soft cleaning brush, “anti bacterial sponge” ఉన్నాయి. సాఫ్ట్ బ్రష్ ఉపయోగించి ఇయర్ ఫోన్ లోపలి భాగాన్ని శుభ్రం చేసి, అనంతరం స్పాంజ్ ఉన్న మెషిన్ లో వేస్తె, అతి శుభ్రంగా, కొత్తదానిలా మెరిసిపోయే ఇయర్ ఫోన్ బయటకు వస్తుంది.

Also Read: Amazon Year end sale: అమెజాన్ లో “ఇయర్ ఎండ్” డిస్కౌంట్ సేల్ లో టాప్ స్మార్ట్ ఫోన్స్

యాపిల్ AirPods, బోస్ QuietComfort, శాంసంగ్ Buds Pro, Jabra వంటి కాస్ట్లీ ఇయర్ ఫోన్స్ వాడే వారికి ఈ బుల్లి వాషింగ్ మెషిన్ ఎంతో ఉపయోగపడుతుందని తయారీదారుడు పేర్కొన్నాడు. ఇక ఇటీవల జరిగిన ఓ ఎలక్ట్రానిక్ ఎక్జిబిషన్ షోలో ఈ పరికరాన్ని ప్రదర్శించారు. దీని ధర డెలివరీ చార్జీలతో కలుపుకుని సుమారు US $45లుగా ఉంటుంది. ఇది చూసిన నెటిజన్లు పావలా కోడికి ముప్పావలా మసాలా అంటే ఇదేనేమో అంటూ నవ్వుకుంటున్నారు.