Sri Lanka: సాయాన్ని ఆపొద్దు.. ఇండియాకు శ్రీలంక వినతి

తమ దేశ అధ్యక్షుడిగా ఎవరు ఎంపికైనా శ్రీలంకకు సాయం చేయడం ఆపొద్దని ఇండియాను కోరారు ఆ దేశ ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస. భారత ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, దేశంలోని రాజకీయ పార్టీలు, భారత ప్రజలను ఆయన వేడుకున్నారు.

Sri Lanka: సాయాన్ని ఆపొద్దు.. ఇండియాకు శ్రీలంక వినతి

Sri Lanka

Sri Lanka: శ్రీలంక అధ్యక్షుడిగా ఎవరు ఎంపికైనప్పటికీ తమ దేశానికి సాయం చేయడం మాత్రం ఆపొద్దని ఇండియాను కోరారు లంక ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస. రేపు శ్రీలంకలో కొత్త అధ్యక్షుడి ఎంపిక జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఎవరు ఎంపికైనా సాయం చేయాలని ఇండియాను ప్రేమదాస కోరారు.

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకెళ్తున్న రిషి సునక్.. నాలుగో రౌండ్లో ముందంజ

దీనికి సంబంధించి మంగళవారం ప్రేమదాస ఒక ట్వీట్ చేశారు. ‘‘భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఒక వినతి.. రేపు ఎవరు శ్రీలంక అధ్యక్షుడిగా ఎంపికైనా మాకు సాయం చేయడం మాత్రం ఆపొద్దు. ఇండియాలోని అన్ని రాజకీయ పార్టీలను, భారత ప్రజలను మాకు సాయపడాల్సిందిగా కోరుతున్నాం. శ్రీలంక ప్రజలు ఈ విపత్తు నుంచి బయటపడేవరకు మీ సాయం అందించండి’’ అని ప్రేమదాస తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న శ్రీలంకకు ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ అత్యధిక సాయం అందిస్తోంది. శ్రీలంకలో బుధవారం అధ్యక్ష, ప్రధాని పదవుల కోసం ఎంపిక జరగబోతుంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. శ్రీలంక పొదుజన పెరామునా (ఎస్ఎల్‌పీపీ) పార్టీ తరఫున దల్లాస్ అలహపెరుమ్మ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.

Nupur Sharma: నుపుర్ శర్మకు ఊరట.. అరెస్టు నుంచి మినహాయింపు

విక్రమసింఘేతో అలహపెరుమ్మా పోటీ పడతారు. మరోవైపు శ్రీలంక సంక్షోభంపై భారత్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం కేంద్రం ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. శ్రీలంక పరిస్థితులు ఇండియాకు ఒక పాఠం లాంటివని, బాధ్యతాయుత ప్రభుత్వం అవసరమని, ఉచిత పథకాలు అవసరం లేదని కేంద్ర మంత్రి జైశంకర్ అన్నారు.