దక్షిణ కొరియా బిల్డింగ్స్ అన్నీ కూల్చేయండి…కిమ్ ఆదేశం

  • Published By: venkaiahnaidu ,Published On : October 23, 2019 / 04:36 PM IST
దక్షిణ కొరియా బిల్డింగ్స్ అన్నీ కూల్చేయండి…కిమ్ ఆదేశం

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఉత్తర కొరియాలోని మౌంట్ కుమ్ గాంగ్ రిసార్ట్‌పై నిర్మించిన దక్షిణ కొరియాకు చెందిన హోటళ్లు, ఇతర పర్యాటక నిర్మాణాలను కూల్చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలో మోడ్రన్ బిల్డింగ్స్ ను కట్టాలని ఆదేశించారు. ఇటీవలే డైమండ్‌ మౌంటేన్‌ రిసార్ట్‌ ప్రాంతాన్ని కిమ్ సందర్శించాను. ఈ ప్రాంతంలో దక్షిణ కొరియా నిర్మించిన హోటళ్లు​ నార్త్ కొరియా జాతీయ భావాన్ని అభివర్ణించేవిగా లేకపోవడంతో కిమ్ కూల్చివేత నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మీడియా తెలిపింది.

అయితే ఏడాది కాలంగా ఇరు దేశాల మద్య ఆర్థిక సంబంధాలు బలోపేతం కావడానికి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌-జే-ఇన్‌ కిమ్‌ తో మూడుసార్లు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. విభజనకు ముందు మా పూర్వీకులు డబ్బులకు ఆశపడి ఈ ప్రాంతాలను లీజుకిచ్చారు. అప్పటి నుంచి పది సంవత్సరాల వరకు ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. దీంతో ఎటువంటి నాణ్యత ప్రమాణాలు లేకుండానే అక్కడ హోటళ్లను, పర్యాటక నిర్మాణాలు ఏర్పాటు చేయడంతో అవి గుడారాల్లాగా మిగిలిపోయాయి. పూర్వీకులు చేసిన తప్పిదాన్ని సరిదిద్దాలనే ఉద్దేశంతోనే.. పొరుగు దేశం నిర్మించిన భవనాలను కూల్చేయాలని అధికారులను ఆదేశించాను అని కిమ్‌ మీడియాతో అన్నారు.