హోమ్ లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ రాజీనామా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన వివిదాస్పద ఇమ్మిగ్రేషన్ పాలసీల విధానాల కోసం పనిచేసిన అమెరికా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టిన్‌ నీల్సన్‌ తన పదవికి రాజీనామా చేశారు.

  • Published By: venkaiahnaidu ,Published On : April 8, 2019 / 10:30 AM IST
హోమ్ లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ రాజీనామా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన వివిదాస్పద ఇమ్మిగ్రేషన్ పాలసీల విధానాల కోసం పనిచేసిన అమెరికా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టిన్‌ నీల్సన్‌ తన పదవికి రాజీనామా చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన వివిదాస్పద ఇమ్మిగ్రేషన్ పాలసీల విధానాల కోసం పనిచేసిన అమెరికా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టిన్‌ నీల్సన్‌ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఎందుకు రాజీనామా చేశానన్న విషయాన్ని ఆమె వివరించలేదు. సరైన సమయంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. బుధవారం (ఏప్రిల్-10,2019) వరకు సెక్రటరీగా తాత్కాలికంగా కొనసాగనున్నట్లు ఆమె ట్వీట్ ద్వారా తెలిపారు. ఇప్పుడు అమెరికా సురక్షితంగా ఉందని నీల్సన్‌ తెలిపారు.
Read Also : BJP హామీలు : రైతులకు క్రెడిట్ కార్డులు, పెన్షన్లు, రూ.6వేల సాయం

ఆదివారం ట్రంప్ నీల్సన్ రాజీనామా విషయాన్ని ప్రకటించారు.ఆమె అందించిన సేవలకు ధన్యవాదాలు తెలిపారు.నీల్సన్‌ స్థానంలో కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ కమిషనర్‌ కెవిన్‌ మెక్‌ అలీనమ్‌ బాధ్యతలు స్వీకరిస్తారని డోనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. నీల్సన్ రాజీనామాపై ట్రంప్ యంత్రాంగంలోని ఓ సీనియర్ అధికారి స్పందిస్తూ…బోర్డర్ లో పరిస్థితిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారని, రాజీనామా చేయాలని నీల్సన్ ను కోరారని తెలిపారు.

పవర్ ఫుల్ ఏజెన్సీ అయిన హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీకి 18నెలలు హెడ్ గా పనిచేసిన నీల్సన్.. సరిహద్దుల దగ్గర అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్నావాళ్లను పట్టుకొని, వారి పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేసే వివాదాస్పదమైన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. మెక్సికో సరిహద్దు దగ్గర గోడ నిర్మించాలన్న ట్రంప్‌ విధానాన్ని నీల్సన్‌ సమర్థించారు.

మెక్సికోతో బోర్డర్‌ ను మూసివేస్తానని ఇటీవల తెలిపిన ట్రంప్‌ ఆ తర్వాత కొంత వెనక్కి తగ్గారు.అమెరికాలోకి మాదకద్రవ్యాలను, శరణార్థుల రవాణాలను నిలిపివేయాలని మెక్సికోకు వార్నింగ్‌ ఇచ్చారు.లేకుంటే బోర్డర్ ను మూసివేయడం లేదా టారిఫ్ లు విధించడం తప్ప తమకు వేరే ఛాయిస్ లేదని,తమ దేశం ఫుల్ అయిపోందని ట్రంప్  ట్వీట్ చేశారు.

Read Also : తిట్టేది అభిమానంతో.. కొట్టేది ప్రేమతో : బాలయ్య భార్య వసుంధర