Kuwait Foreigners : వ్యాక్సిన్ 2 డోసులు తీసుకుంటేనే.. కువైట్‌లోకి ఎంట్రీ

వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారా? లేదంటే ఆ దేశంలోకి విదేశీయులకు అనుమతి లేదు. వ్యాక్సిన్ రెండు పూర్తి డోసులు తీసుకున్న విదేశీయులకే తమ దేశంలోకి అనుమతిస్తుంది కువైట్..

Kuwait Foreigners : వ్యాక్సిన్ 2 డోసులు తీసుకుంటేనే.. కువైట్‌లోకి ఎంట్రీ

Kuwait To Allow Full Vaccinated Foreigners Entry Into Country From August Month

Kuwait Vaccinated Foreigners : వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారా? లేదంటే ఆ దేశంలోకి విదేశీయులకు అనుమతి లేదు. వ్యాక్సిన్ రెండు పూర్తి డోసులు తీసుకున్న విదేశీయులకే తమ దేశంలోకి అనుమతిస్తుంది కువైట్.. నెల రోజుల సస్పెన్షన్ తర్వాత ఆగస్టు 1 నుంచి ప్రవాస భారతీయులను దేశంలోకి తిరిగి రావడానికి అనుమతిస్తామని కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తితో గత ఏడాది నుంచి విదేశీయుల రాకను కువైట్ నిషేధించింది. సెలవుపై  స్వదేశానికి వెళ్లిన ప్రవాసులు తిరిగి కువైట్ రాలేకపోతున్న పరిస్థితి నెలకొంది. భారీ సంఖ్యలో స్వదేశంలోనే ఇరుక్కుపోయారు. రాయలసీమ నుంచే వేలాది మంది ప్రవాసులు తమ ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది.

రెండు డోసుల టీకా తీసుకున్న విదేశీయులను ఆగస్టు ఒకటి నుంచి తిరిగి దేశంలోకి అనుమతించాలని కువైత్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గుర్తింపు పొందిన వ్యాక్సిన్ తీసుకొని 72 గంటల ముందు చేసిన ఆర్టీ పీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారికి మాత్రమే తమ దేశంలోకి అనుమతిస్తామని కువైట్ ప్రకటించింది. వారం రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని కోరింది. మళ్లీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని తెలిపింది. కరోనాపై పూర్తిగా టీకాలు వేసిన విదేశీయులను దేశంలోకి అనుమతిస్తామని కువైట్ పేర్కొంది.

వైరస్ వ్యాప్తిని పరిమితం చేసే ప్రయత్నంలో విదేశీయులను ఫిబ్రవరిలో గల్ఫ్ దేశం నిషేధించింది. ఇటీవలి వారాల్లో దాని కొవిడ్ -19 పరిమితుల్లో కొన్నింటిని సడలించింది. ప్రభుత్వ ప్రతినిధి తారెక్ అల్-మిజ్రేమ్ మాట్లాడుతూ.. గల్ఫ్ దేశం ఆమోదించిన నాలుగు వ్యాక్సిన్లలో ఫైజర్ / బయోఎంటెక్, ఆస్ట్రాజెనెకా, మోడరనా జాన్సన్ & జాన్సన్ ఏదైనా ఒకటి విదేశీ ప్రయాణికులు పూర్తిగా టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మరోవైపు.. పూర్తిగా టీకాలు తీసుకున్న కువైట్ పౌరులు ఆగస్టు 1 నుంచి విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. అయితే గర్భిణీ స్త్రీలకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది కువైట్ ప్రభుత్వం.

గతంలో కువైట్స్ ప్రయాణించడానికి కనీసం ఒక టీకా డోసు తీసుకుని ఉండాలి. పూర్తిగా టీకాలు వేసిన వారికి మాత్రమే జూన్ 27 నుంచి పెద్ద షాపింగ్ మాల్స్, జిమ్‌లు, రెస్టారెంట్లకు కువైట్ అనుమతించనుంది. 6,000 చదరపు మీటర్లకు పైగా రెస్టారెంట్లు, కేఫ్‌లు, జిమ్‌లు, సెలూన్లు, షాపింగ్ మాల్‌లలోకి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కువైట్ అధికారికంగా 332,000 కరోనావైరస్ కేసులు ఉండగా.. 1,800 కు పైగా మరణాలు నమోదయ్యాయి.