Apple Watch Tracker : గర్ల్ ఫ్రెండ్ కారుకు ఆపిల్ వాచ్.. లొకేషన్ ట్రాక్ చేస్తున్న బాయ్‌ఫ్రెండ్ అరెస్ట్..!

Apple Watch Tracker : అతడికి తన గర్ల్ ఫ్రెండ్‌పై అనుమానం.. ఎప్పుడూ ఎవరితో మాట్లాతుంది.. ఎక్కడికి వెళ్తుంది.. ప్రతిదీ తెలుసుకోవాలని అనుకునేవాడు.

Apple Watch Tracker : గర్ల్ ఫ్రెండ్ కారుకు ఆపిల్ వాచ్.. లొకేషన్ ట్రాక్ చేస్తున్న బాయ్‌ఫ్రెండ్ అరెస్ట్..!

Life360 App Man Arrested For Tracking Girlfriend By Attaching Apple Watch To Her Car

Apple Watch Tracker : అతడికి తన గర్ల్ ఫ్రెండ్‌పై అనుమానం.. ఎప్పుడూ ఎవరితో మాట్లాతుంది.. ఎక్కడికి వెళ్తుంది.. ప్రతిదీ తెలుసుకోవాలని అనుకునేవాడు. తన గర్ల్ ఫ్రెండ్ లొకేషన్ ట్రాక్ చేసేందుకు ఆపిల్ వాచ్ వినియోగించాడు. ఆపిల్ వాచ్ లో ఇన్ స్టాల్ చేసిన థర్డ్ పార్టీ యాప్ ద్వారా తన ప్రియురాలు ఎక్కడ ఉంటుందో ప్రతిరోజూ ట్రాక్ చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన అమెరికాలోని టేనస్సీలోని నాష్‌విల్లేలో జరిగింది.

ఆపిల్ వాచ్‌లో Life 360 Location Tracker అనే థర్డ్ పార్టీ ఫీచర్ ఇందుకోసం వినియోగించాడు. ఈ యాప్ ద్వారా ఆపిల్ వాచ్ ధరించిన వ్యక్తి ఎక్కడ ఉన్నా లొకేషన్ ట్రాక్ చేయొచ్చు. ఇలాంటి ఆధునాతన టెక్నాలజీని మోసపూరిత చర్యలకు అధికంగా వినియోగిస్తున్నారు. లారెన్స్ వెల్చ్ (29) ఏళ్ల యవకుడు కూడా ఆపిల్ వాచ్‌లో Life 360 ట్రాకింగ్ యాప్ సాయంతో తన గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉందో ట్రాక్ చేసినందుకు అరెస్ట్ అయ్యాడు. తన ప్రియురాలి లొకేషన్ ట్రాక్ చేసేందుకు లారెన్స్ వెల్చ్ ఆపిల్ వాచ్ లోని Life 360 Tracking Feature వినియోగించాడు. ఆపిల్ వాచ్ గర్ల్ ఫ్రెండ్ వాడే కారు చక్రానికి అటాచ్ చేశాడు. అలా ఆమె ప్రతిరోజు ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేస్తూ వచ్చాడు.

చివరికి ఆ విషయం ఆమెకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించింది. అంతేకాదు… తన ప్రియుడు తనను చంపేస్తానని పలుమార్లు బెదిరించినట్టు కూడా పోలీసులకు ఫిర్యాదుచేసింది. తాను ఎక్కడికి వెళ్లిందో లొకేషన్ షేర్ చేయమని తనను వేధించేవాడని వాపోయింది. తనకు అనుమానం వచ్చి ట్రాకింగ్ ఆఫ్ చేసినప్పుడు.. తన లొకేషన్ చెప్పమంటూ మెసేజ్ లు పంపేవాడని, అసభ్య పదజాలతో దూషించేవాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు లారెన్స్ వెల్చ్‌ను అరెస్ట్ చేశారు.  అంతకుముందు.. అతడు కారు చక్రానికి అటాచ్ చేసిన ఆపిల్ వాచ్ తొలగించేందుకు ప్రయత్నించాడు.

అదేసమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు ఆపిల్ వాచ్‌ను గుర్తించారు. ఈ వాచ్ ఎవరిదని పోలీసులు ప్రశ్నించగా తనదేనని వెల్చ్ అన్నాడు. వెల్చ్.. Life360 అనే యాప్ ద్వారా ప్రియురాలిని ట్రాక్ చేసినట్టు తెలిపాడు. బాధితురాలు తన Life360 యాప్‌ను ఆఫ్ చేసినప్పుడు.. వెల్చ్ తన వెర్షన్‌ను Apple వాచ్‌లో యాక్టివ్‌గా ఉంచాడు. దాంతో ఆమె యాప్ యాక్టివేట్ చేయనప్పుడు కూడా ప్రియురాలు లొకేషన్‌ను ట్రాక్ చేయడానికి ఈ యాప్‌ ఉపయోగించాడు. గతంలోనూ ఆపిల్ కంపెనీకి Airtags కు సంబంధించి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవలే ఆపిల్ ఎయిర్ ట్యాగ్ ల కోసం యాంటీ స్టాకింగ్ ఫీచర్ రిలీజ్ చేసింది. అయితే, ఆపిల్ ఈ ఎయిర్ ట్యాగ్ ట్రాకింగ్ లపై లిమిట్ తగ్గించాలని భావిస్తోంది.

Read Also : Apple Watch 6 Series : భారతీయ డెంటిస్ట్ ప్రాణాలను కాపాడిన ఆపిల్ స్మార్ట్ వాచ్‌..!