Bernard Arnault : ప్రపంచ కొత్త కుబేరుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్‌ని బీట్ చేసిన 72ఏళ్ల బిజినెస్ మ్యాన్

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరు అంటే, ఇంకెవరు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అని ఠక్కున చెప్పేస్తారేమో. ఒక్క సెకన్ ఆగండి. ఇకపై అలా చెప్పొద్దు. ఎందుకంటే ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ కాదు. కొత్తాయన వచ్చేశాడు. జెఫ్ బెజోస్ ని బీట్ చేసి ప్రపంచ కుబేరుడు అయ్యాడు. ఆయనే

Bernard Arnault : ప్రపంచ కొత్త కుబేరుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్‌ని బీట్ చేసిన 72ఏళ్ల బిజినెస్ మ్యాన్

Bernard Arnault

Bernard Arnault : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరు అంటే, ఇంకెవరు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అని ఠక్కున చెప్పేస్తారేమో. ఒక్క సెకన్ ఆగండి. ఇకపై అలా చెప్పొద్దు. ఎందుకంటే ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ కాదు. కొత్తాయన వచ్చేశాడు. జెఫ్ బెజోస్ ని బీట్ చేసి ప్రపంచ కుబేరుడు అయ్యాడు. ఆయనే బెర్నార్డ్ ఆర్నాల్ట్. ఈయన ఫ్రెంచ్ ఇన్వెస్టర్, బిజినెస్ మ్యాన్, ఆర్ట్ కలెక్టర్. ప్రపంచంలోనే అతి పెద్ద లగ్జరీ గూడ్స్ కంపెనీ LVMH Mote Hennessy కి చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్.

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద నికర విలువ ఒక రోజులో 13.9 బిలియన్ డాలర్లు పడిపోయింది. దీంతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా బెర్నార్డ్ అయ్యాడు. బెర్నార్డ్ వయసు 72ఏళ్లు. ఫ్యాషన్, జువెలరీ, కాస్మటిక్స్, వైన్స్, స్పిరిట్స్ వ్యాపారం చేస్తారు. లూయిస్ విట్టన్, క్రిస్టియన్ డియర్, బల్గరీ, ట్యాగ్ హుర్, సెఫోర్, హెన్నెసీ, టిఫానీ బ్రాండ్స్ ఉన్నాయి. LVMH లో ఆర్నాల్డ్ కు 47శాతం వాటా ఉంది.. దాని మార్కెట్ కాపిలైజేషన్ విలువ 402.9 బిలియన్ డాలర్లు. LVMH స్టాక్ విలువ 35శాతం పెరిగింది. 2020 మార్చి నుంచి దాని విలువ 140శాతం పెరిగింది.

స్టాక్ విలువ పెరగడంతో ఆర్నాల్డ్ సంపద పెరిగింది. వరల్డ్ రిచెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం బెర్నార్డ్ సంపద 186.3 బిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం జెఫ్ బెజోస్ సంపద కన్నా 300 మిలియన్ డాలర్లు, టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలన్ మస్క్ సంపద కన్నా 147.3 బిలియన్ డాలర్లు ఎక్కువ.

కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో లగ్జరీ గూడ్స్ ఒకటి. ఈ రంగం తీవ్ర నష్టాలు చవి చూసింది. అయితే ఆర్థికంగా పుంజుకోవడంలో చైనా సఫలం కావడంతో లగ్జరీ గూడ్స్ కి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. LVMH కి మంచి లాభాలు వచ్చాయి. 2020 చివరి నుంచి లాభాలు మొదలయ్యాయి. 2021లోనూ లాభాలు కొనసాగాయి. బెజోస్ ఆస్తుల విలువ పడిపోవడం, అదే సమయంలో బెర్నార్డ్ ఆస్తుల విలవ పెరగడం జరిగాయి. వరల్డ్ రిచెస్ట్ పర్సన్ గా బెర్నార్డ్ నిలవడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఆయన పలుమార్లు ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.