తాలిబాన్ తుపాకీ బుల్లెట్లు దిగిన ఎనిమిదేళ్ల తర్వాత, మలాలా ఆక్స్‌ఫర్డ్‌ వర్సీటీలో డిగ్రీ పూర్తిచేసింది

మలాలా యూస‌ఫ్‌ జాయ్.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అమ్మాయి. బాలికల

  • Published By: naveen ,Published On : June 20, 2020 / 04:03 AM IST
తాలిబాన్ తుపాకీ బుల్లెట్లు దిగిన ఎనిమిదేళ్ల తర్వాత, మలాలా ఆక్స్‌ఫర్డ్‌ వర్సీటీలో డిగ్రీ పూర్తిచేసింది

మలాలా యూస‌ఫ్‌ జాయ్.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అమ్మాయి. బాలికల

మలాలా యూస‌ఫ్‌ జాయ్.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అమ్మాయి. బాలికల విద్యపై పోరాడుతూ పాకిస్తాన్‌లో తుపాకీ గుండుకు ఎదురొడ్డి నిలిచి అతి పిన్న వయసులోనే నోబెల్‌ శాంతి బహుమతి సాధించిన మలాలా యూసఫ్‌జయ్‌(22) చదువులో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఒకటైన బ్రిటన్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆమె డిగ్రీ పూర్తి చేశారు. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా ఆమె స్వయంగా వెల్లడించారు. మలాలా డిగ్రీ పట్టా అందుకోవడంతో కుటుంబసభ్యులు సంబరాలు చేసుకున్నారు. తన కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేసిన ఫొటోలను మలాలా షేర్‌ చేశారు. ‘హ్యాపీ గ్రాడ్యుయేషన్‌ మలాలా’ అని రాసి ఉన్న కేక్‌ను ఆమె కట్‌ చేశారు.

భవిష్యత్తు గురించి ఆలోచనలు లేవు:
”నేను ఆక్స్‌ఫర్డ్‌లో నా ఫిలాసఫీ(తత్త్వశాస్త్రం), పాలిటిక్స్(రాజనీతిశాస్త్రం)‌, ఎకనామిక్స్‌(అర్థశాస్త్రం) డిగ్రీ పూర్తి చేశాను. దీనిపై నా ఆనందాన్ని తెలపడానికి మాటలు రావడం లేదు. ఇక ముందు ఏం జరుగుతుందో నాకు తెలియదు. భవిష్యత్తు గురించి ఆలోచనలు లేవు. ప్రస్తుతానికి నెట్‌ఫ్లిక్స్‌ చూడటం, పుస్తకాలు చదవడం, నిద్ర పోవడం ఇదే నా పని’ అని మలాలా తెలిపారు. 

2012లో మలాలాపై తాలిబన్ల కాల్పులు:
బాలికల విద్య కోసం పోరాడిన మలాలా.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పాకిస్తాన్‌లో బాలికలను పాఠశాలల్లోకి అనుమతించాలని మలాలా ప్రచారం చేయడంతో.. 2012లో స్వాత్ లోయలో ఆమె ప్రయాణిస్తున్న స్కూలు బస్సుపై తాలిబన్ మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆమె తలకు గాయమైంది. ఆమెను బ్రిటన్‌ తరలించి మెరుగైన చికిత్స అందించారు. ఈ క్రమంలోనే మలాలా సేవకు గుర్తింపుగా 2014లో నోబెల్ శాంతి బహుమతి ఆమెను వరించింది. అప్పటికి మలాలా వయసు 17 సంవత్సరాలే.

Read: Indians అంటే తనకిష్టం లేదంటోన్న Porn STAR