Muskmelons massage : పండ్లకు ‘మసాజ్’ చేస్తే..సూపర్ టేస్ట్..!..పదేళ్ల పరిశోధనలకు ఫలితం అంటున్న రైతులు

Muskmelons massage : పండ్లకు ‘మసాజ్’ చేస్తే..సూపర్ టేస్ట్..!..పదేళ్ల పరిశోధనలకు ఫలితం అంటున్న రైతులు

Muskmelons Massage With Music

Japanese muskmelons with music and massage :  కూరగాయాలైనా..పండ్లు అయినా..ధాన్యం అయినా బాగా పండాలి అంటే పుష్కలంగా నీరుండాలి. సారవంతమైన భూమి ఉండాలి. పంటలకు చీడ పీడలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే చక్కటి పంటలు పండుతాయి. కానీ వీటితో పాటు మొక్కలకు సంగీతం వినిపించి..కాసిన కాయలకు చక్కటి ‘మసాజ్’ చేయాలని అంటున్నారు కొంతమంది రైతన్నలు. పండ్లకు మసాజ్ చేస్తే సూపర్ టేస్టుగా ఉంటాయంటున్నారు.

3

అదేంటీ కాయలకు మసాజ్ చేయటమేంటీ? అని షాక్ అవుతున్నారా? నిజమేమరి ఆశ్చర్యంగా ఎందుకుండదు? మొక్కలకు..పొలంలో పంటలకు సగీతం వినిపిస్తే పంట దిగుబడి బాగా వస్తుందనే మాట ఎప్పటినుంచో వింటున్నాం. కానీ కొత్తగా పండ్లకు మసాజ్ చేయటమేంటీ? అని ఆశ్చర్యంగా ఉంది కదూ.. మలేషియా కంపెనీకి చెందిన ముగ్గురు రైతులు మాత్రం పండ్లకు మసాజ్ చేయాలంటున్నారు. అలా చేస్తే పండ్లు మంచి రుచిగా ఉంటాయంటున్నారు. అంతేకాదు కాయలు పచ్చిగా ఉన్నప్పుడు మసాజ్ చేస్తే కాయలు పెద్ద సైజుగా అవుతాయంటున్నారు.

1

జపాన్‌లో కనిపించే ఓరకమైన పుచ్చకాయలు(జపనీస్ మెలన్స్.అంటే మనం కర్భూజా పండ్లు అంటాం) మలేషియాలోనూ విరగ పండాలంటే ఇదే చేయాలని వారు చెబుతున్నారు. దాదాపు 10 సంవత్సరాల పాటు అధ్యయనం చేసి ఈ విషయాన్ని కనిపెట్టారట. మెత్తని వస్త్రంతో వారు ఈ పుచ్చకాయలకు మసాజ్ చేస్తారు. ఈ విధానాన్ని అక్కడ టామా-ఫుకీ అని పిలుస్తారు. దీనికి తోడు ఆ మొక్కలకు సంప్రదాయ సంగీతం కూడా వినిపిస్తారట. ఇలా చేస్తే..వాటి కాయలు పెద్ద సైజులుగా ఎదుగుతాయి అని చెబుతున్నారు. అంతేకాదు కాయలకు మసాజ్ చేస్తే పండ్లకు మంచి రుచి కూడా వస్తుందంటున్నారు. మలేషియాకు చెందిన మోనో ప్రీమియమ్ అనే కంపెనీలో వారు ఈ పండ్లను పెంచుతున్నారు.

6

కాగా.. ఈ పుచ్చకాయలకున్న రుచి కారణంగా ఇది మాంచీ హైపిచ్ ధరలకు అమ్ముడుపోతుంటాయి. అలా చేసిన కాయలు చక్కటి ధరకు అమ్ముడవుతున్నాయనీ..ఒక్కో పండు మలేషియా కరెన్సీలో 168 రింగ్ గిట్స్ (ringgit) అంటే మన ఇండియా కరెన్సీలో 3,000లకు పైనే ధరకు అమ్ముడవుతున్నాయట.

5

జపాన్‌లో సాధారణంగా శీతల వాతావరణంలో ఇవి పెరుగుతాయి. అయితే..భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న మలేషియాలో ఇందుకు భిన్నమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి..మలేషియా రైతులు జపాన్ సాగు పద్ధతులను అర్థం చేసుకుని ఆ తరువాత మలేషియా పరిస్థితులకు తగ్గట్టుగా వాటికి మార్పులు చేయడంతో పాటూ కొన్ని అదనపు విధానాలను జోడిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు సాగు పద్ధతులకు మసాజ్, సంగీతాన్ని కూడా జోడించి పండించేస్తున్నారు. మరి మొక్కలు ఏం కావాలో రైతన్నలకు తెలిసినంత బాగా ఇంకె వరికి తెలుస్తుంది.