మాలిలో ఉగ్రవాదుల ఘాతుకం: 21 మంది సైనికులు మృతి

  • Published By: veegamteam ,Published On : March 18, 2019 / 05:04 AM IST
మాలిలో ఉగ్రవాదుల ఘాతుకం: 21 మంది సైనికులు మృతి

బమాకో : మాలిలో ఉగ్రవాదులు మరోసారి దాడులకు తెగబడ్డారు. సెంట్రల్‌ మాలిలోని దియౌరాలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రదాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 21 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 17 ఆదివారం కార్లు, బైకులపై వచ్చిన ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు..ఈ కాల్పుల్లో 21 మంది సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు సైనిక వర్గాలు దృవీకరించాయి.
Read Also : నోటిఫికేషన్ వచ్చేసింది.. నామినేషన్ వేయవచ్చు

ఈ దాడిపై మాలి అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకార్‌ స్పందించారు. ఇలాంటి సమయాల్లో దేశ ప్రజలంతా ఏకమై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఇబ్రహీం బౌబకార్‌ కీట పిలుపునిచ్చారు.ఈ దాడితో మాలిలో  ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న భూబంధిత దేశం అయిన “రిపబ్లిక్ ఆఫ్ మాలి”గా పిలువబడుతోంది.  వైశాల్యపరంగా మాలి ఆఫ్రికాలో ఎనిమిదో అతిపెద్ద దేశంగా ఉంది. 

2016లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో  17 మందిసైనికులు మరణించగా..గత ఏడాది అంటే 2018లో జరిపిన ఉగ్రదాడిలో ఏకంగా 40మంది సైనికులు మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరుసగా మాలిపై జరుగుతున్న ఉగ్రదాడిలో సైనికులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాగా.2015లో మాలి రాజధాని బమాకో నగరం మధ్యనున్న రాడిసన్‌ బ్లూ హోటల్‌ ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన ఘటనలో 18మందిని బలితీసుకున్నారు. ప్రభుత్వ అధికారులు..వ్యాపారవేత్తలు బస చేసే ఈ హొటల్ పై జరిగిన దాడిలో 18మంది ఫ్రెంచ్ పౌరులు మరణించిన విషయం తెలిసిందే.
Read Also : ఆఫ్రికా దేశాల్లో ‘ఇడాయ్’ తుఫాన్…140 మంది మృతి