Bra : వార్నీ.. పిచ్చ కామెడీ.. సాక్స్ ఆర్డర్ చేస్తే బ్రా వచ్చింది..

ఇటీవలి కాలంలో ఈ కామర్స్ సంస్థల తప్పిదాలు ఎక్కువయ్యాయి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనం ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి డెలివరీ చేస్తున్నాయి. ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ కాకుండా సబ్బులు..

Bra : వార్నీ.. పిచ్చ కామెడీ.. సాక్స్ ఆర్డర్ చేస్తే బ్రా వచ్చింది..

Bra

Bra : ఇటీవలి కాలంలో ఆన్ లైన్ షాపింగ్ విపరీతంగా పెరిగింది. అంతా ఇంట్లో కూర్చునే తమకు కావాల్సిన వస్తువులు తెప్పించుకుంటున్నారు. కాలు కదపకుండానే జస్ట్ ఒక్క క్లిక్ తో నచ్చిన ప్రొడక్ట్ ని కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలో ఈ కామర్స్ సంస్థల తప్పిదాలు ఎక్కువయ్యాయి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనం ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి డెలివరీ చేస్తున్నాయి. ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ కాకుండా సబ్బులు, రాళ్లు, ఇటుకలు, సర్ఫ్ ప్యాకెట్లు ఉండటం లాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. రీసెంట్ గానే అలాంటి ఘటన ఒకటి జరిగింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 12 ఆర్డర్ చేస్తే రెండు సబ్బులు రావడం ఆర్డర్ చేసిన వ్యక్తినే కాదు అందరినీ షాక్ కి గురి చేసింది.

Free Wi-Fi: ఉచిత వైఫై వాడుతున్నారా? రిస్క్ చేస్తున్నట్లే.. తస్మాత్ జాగ్రత్త!!

ఇది మరువక ముందే అలాంటి తప్పిదం మరొకటి చోటు చేసుకుంది. అయితే, ఈ కామర్స్ సంస్థల తప్పిదాలు కోపాన్నే కాదు ఒక్కోసారి నవ్వు కూడా తెప్పిస్తాయి. అందుకు తాజాగా జరిగిన ఘటనే నిదర్శనం. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అతడు ఫుట్ బాల్ స్టాకింగ్స్(సాక్స్) కోసం మింత్రాలో ఆర్డర్ పెట్టాడు. అయితే అతడికి బ్రా వచ్చిందట. ఈ విషయంపై అతడు కస్టమర్ కేర్ ను సంప్రదించగా, దాన్ని మార్చలేము అని రిప్లయ్ వచ్చిందట. దీంతో అతడు ఇదంతా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో స్పందించిన మింత్రా పొరపాటుకు చింతిస్తున్నామని తెలిపింది.

WhatsApp self-chat: చిన్న ట్రిక్‌తో వాట్సప్‌లో సెల్ఫ్ మెసేజ్!

”ఆర్డర్ చేసిన వ్యక్తి పేరు కశ్యప్. ట్విట్టర్ యూజర్ (@LowKashWala). జత ఫుట్‌బాల్ స్టాకింగ్స్ (పొడవైన సాక్స్ వంటివి) కోసం మింత్రాలో ఆర్డర్ ఇచ్చా. ఆర్డర్ డెలివరీ అయ్యాక చూస్తే.. అందులో నల్ల బ్రా ఉంది. అది ట్రయంప్ బ్రాండ్ నేమ్‌తో ఉంది. వెంటనే ఈ విషయమై మింత్రా కస్టమర్ కేర్‌ ని కాంటాక్ట్ అయితే… డెలివరీ ఐటెమ్‌ని మార్చడం కుదరదని చెప్పారు” అని కశ్యప్ తెలిపాడు.

Belly Fat : కూరగాయలతో పొట్ట కొవ్వును కరిగించండి..

కస్టమర్లు ఇలాంటి ఖరీదైన ఆర్డర్లు చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మీరు కూడా ఇలాంటి ఖరీదైన ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తే పార్శిల్ రాగానే హడావుడిగా ఓపెన్ చేయకుండా, పార్శిల్ ఓపెన్ చేసేప్పుడు వీడియో రికార్డ్ చేయాలి. వీడియో రికార్డ్ చేసేప్పుడు పార్శిల్‌పైన ఉన్న బిల్, ఇన్‌వాయిస్ వివరాలు కూడా వీడియోలో రికార్డ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మీరు ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ కాకుండా వేరే ప్రొడక్ట్ వస్తే మీ దగ్గర వీడియో సాక్ష్యం ఉంటుంది. అవసరమైతే డెలివరీ చేసిన వ్యక్తి ముందే పార్శిల్ ఓపెన్ చేయండి.