Attacks in USA: అమెరికాలో ఆగని దాడులు: ఆసుపత్రిలో వైద్యురాలు, నర్సులపై వ్యక్తి దాడి

ఏంజెల్స్ లోని సథరన్ కాలిఫోర్నియా ఆసుపత్రిలోకి ప్రవేశించిన దుండగుడొకరు..అక్కడి వైద్యురాలిపై, మరో ఇద్దరు నర్సులపై దాడికి పాల్పడ్డాడు

Attacks in USA: అమెరికాలో ఆగని దాడులు: ఆసుపత్రిలో వైద్యురాలు, నర్సులపై వ్యక్తి దాడి

Lapd

Attacks in USA: అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. తుపాకీ సంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోతుంది. కొందరు వ్యక్తుల విపరీత ధోరణితో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. గత నెల రోజుల వ్యవధిలోనే..అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆరు కాల్పుల ఘటనలు వెలుగులోకి రాగా..పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. మృతుల్లో చిన్నారులు, పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నారు. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో మరోసారి దాడుల ఘటన కలకలం రేపింది. లాస్ ఏంజెల్స్ లోని సథరన్ కాలిఫోర్నియా ఆసుపత్రిలోకి ప్రవేశించిన దుండగుడొకరు..అక్కడి వైద్యురాలిపై, మరో ఇద్దరు నర్సులపై దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఆసుపత్రిలోని అత్యవసర వార్డులోకి ప్రవేశించిన దుండగుడు కొన్ని గంటల పాటు అందులో ఉన్నాడు.

Other Stories: Kanpur Clashes: కాన్పూర్ హింస ఘటన ఉగ్రవాద ప్రేరేపితమే: పశ్చిమబెంగాల్, మణిపూర్‌లో మూలాలు గుర్తింపు

ఆసుపత్రి సిబ్బందిపై దాడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈదాడిలో తీవ్రంగా గాయపడ్డ వైద్యురాలిని, మరో ఇద్దరు నర్సులకు అత్యవసర చికిత్స అందించారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాడుల కలకలంతో ఆసుపత్రిలోని మిగతా సిబ్బందిని, రోగులను సమీపంలోని మరో ఆసుపత్రికి తరలించారు. ఈఘటనలో నిందితుడికి సైతం గాయాలు అవడంతో అతన్ని మరో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నిందితుడిపై గతంలోనూ పలు నేరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా అంతకు రెండు రోజుల ముందు బుధవారం నాడు ఓక్లహామా రాష్ట్రం తుల్సా నగరంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోకి ప్రవేశించిన దుండగుడు నలుగురిని కాల్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.