Earthquake : చిలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.2గా నమోదు

చిలీలో భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ చిలీ తీరంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ సీస్మోలజీ వెల్లడించింది.

Earthquake : చిలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.2గా నమోదు

Earthquake

Earthquake : చిలీలో భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ చిలీ తీరంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ సీస్మోలజీ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కి.మీ లోతులో భూ ప్రకంపనలు సంభవించాయని పేర్కొంది.

మార్చి23న దేశంలో కూడా భూకంపం సంభవించింది. ఇక్విక్ లో 6.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. మార్చి22న అర్ధరాత్రి అర్జెంటీనాలో 6.5 తీవ్రతతో భూమి కంపించింది. శాన్ ఆంటోనియో డి లాస్ కోబ్రెస్ కు వాయువ్యంగా 84 కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జీ ఎస్ పేర్కొంది.

Earthquake : జపాన్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.6గా నమోదు

కాగా, 1960 మే22న చిలీలో సంభవించిన భూకంపమే ఇప్పటివరకు అతి పెద్దది. చిలీలో భూకంపం సంభవించింది. బయో-బయో ప్రాంతంలో 10 నిముషాలపాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 9.5గా నమోదు అయింది. దీని ప్రభావంతో సముద్రంలో 25మీటర్ల ఎత్తు వరకు రాకాసి అలలు ఎగసిపడ్డాయి.

రాకాసి అలలు దక్షిణ చిలీ, హవాయి, జపాన్, ఫిలిప్పీన్స్, తూర్పు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తీరాలను తాకాయి. ఈ భూకంపం, సునామీ ధాటికి 1000 నుంచి 6000 మంది మృతి చెందారు. 400 కోట్ల డాలర్ల ఆస్తినష్టం జరిగింది.