Mercedes Car Owner Throws Cash : డబ్బు మదం : బెంజ్ కారులో వచ్చి కరెన్సీ నోట్లు విసిరేసిన వ్యక్తి..కన్నీళ్లు పెట్టుకున్న మహిళ
డబ్బుందనే అహంకారం కొంతమందికి కన్నూ మిన్నూ కానకుండా చేస్తుంది.పనిని గౌరవించకపోవటం..శ్రమ చేసుకుని జీవించేవారి పట్ల పొగరు చూపించటం చేస్తుంటారు కొంతమంది. బెంజ్ కారులో వచ్చిన ఓ వ్యక్తి చూపించిన అహంకారానికి కన్నీరు పెట్టుకుందో మహిళ.

Mercedes Car Owner Throws Cash : డబ్బుందనే అహంకారం కొంతమందికి కన్నూ మిన్నూ కానకుండా చేస్తుంది.పనిని గౌరవించకపోవటం..శ్రమ చేసుకుని జీవించేవారి పట్ల పొగరు చూపించటం చేస్తుంటారు కొంతమంది. అదే జరిగింది చైనాలో. బెంజ్ కారులో వచ్చిన ఓ వ్యక్తి చూపించిన అహంకారానికి కన్నీరు పెట్టుకుందో మహిళ. చైనాలోని ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ పనిచేసే మహిళా ఉద్యోగి పట్ల కారు యజమాని అహంకారపూరితంగా ప్రవర్తించాడు. గ్యాస్ ఫిల్లింగ్ చేయించుకున్నాక డబ్బుల్ని పద్దతిగా ఆమె చేతికి ఇవ్వకుండా కరెన్సీ నోట్లు నిర్లక్ష్యంగా విసిరేసి..తీస్కో అంటూ పొగరుగా అక్కడినుంచి వెళ్లిపోయాడు.
బ్లాక్ కలర్ మెర్సిడెస్ బెంజ్ కారులో వచ్చిన ఓ వ్యక్తి.. గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో ఇంధనం నింపుకున్నాడు. తరువాత డబ్బుమాత్రం అక్కడ ఉన్న మహిళా ఉద్యోగి చేతికి ఇవ్వకుండి కారు విండోలోంచి కిందకు విసిరేశాడు. అది చూసిన ఆమె కన్నీరు పెట్టుకుండి. అంతేతప్ప ఏమీ అనలేదు. దానికి బహుశా ఇటువంటి అవమానాలు ఎన్నో పడి ఉండొచ్చు. కారు విండోలోంచి విసిరేసిన డబ్బును మౌనంగా తీసుకుని తన బ్యాగ్‌లో వేసుకుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు కారు యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.