Flight U turn: ప్రయాణికురాలు మాస్క్ ధరించలేదని “యూ టర్న్” తీసుకున్న విమానం
129 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బందితో దాదాపు గంటన్నర పాటు ప్రయాణించిన విమానం ఒక్కసారిగా ప్రారంభ స్థానానికి తిరిగి వెళ్లడం విస్మయానికి గురిచేసింది.

Flight U turn: విమానంలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ ఒకరు మాస్క్ ధరించేందుకు నిరాకరించడంతో..గాల్లో ప్రయాణిస్తున్న విమానాన్ని ఉన్నట్టుండి వెనక్కు మళ్లించారు. ఈఘటన అమెరికాలో చోటుచేసుకుంది. 129 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బందితో దాదాపు గంటన్నర పాటు ప్రయాణించిన విమానం ఒక్కసారిగా ప్రారంభ స్థానానికి తిరిగి వెళ్లడం విస్మయానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన AA38(Boeing 777-300ER) బుధవారం నాడు అమెరికాలోని మియామీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరింది. టేక్ ఆఫ్ అయిన గంటన్నర వ్యవధిలోనే..విమానాన్ని వెనక్కు మళ్లిస్తున్నట్లు పైలట్ ప్రకటించారు.
Also read: Statue of Equality: ఫిబ్రవరి 5న సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ
విమానంలో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలు ఒకరు.. మాస్క్ ధరించేందుకు నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పైలట్ తెలిపాడు. దీంతో మిగతా ప్రయాణికులు..ఇబ్బంది పడ్డారు. విమానం మియామీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోగానే అక్కడి అధికారులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. కరోనా ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికా వ్యాప్తంగా ప్రజలు మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ అక్కడి ఫెడరల్ కోర్ట్ ఆదేశాలు జారీచేసింది. ఈ నిబంధనలు తమకు ఎక్కడ తంటాలు తెస్తాయోనని భావించిన సదరు ఎయిర్ లైన్స్ పైలట్ ఈనిర్ణయం తీసుకున్నాడు.
Also read: AP Cabinet : నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం.. 32 అంశాలతో కేబినెట్ అజెండా..!
కాగా విమానం ఎగిరి, తిరిగి ల్యాండ్ అయే సమయానికి దాదాపు 2 గంటల 40 నిముషాల సమయం పట్టింది. గ్యాలన్ల కొద్ది ఇంధనం వృధా అయింది. విమానంలో ఉన్న ప్రయాణికులకు తిరిగి టికెట్ బుకింగ్ చేసి 4 గంటల ఆలస్యంగా విమానాన్ని నడిపించారు. ఇది సంస్థకు తీవ్ర నష్టం చేకూర్చగా, ఇదే విమానం.. లండన్ వెళ్లి తిరిగి మియామీ చేరుకోవాల్సి ఉండగా.. ఆ సర్వీసును సంస్థ మొత్తానికే రద్దు చేసింది. దీంతో అంతకు ముందే టికెట్ బుక్ చేసుకున్న(లండన్ – మియామీ) ప్రయాణికులకు డబ్బులు తిరిగి చెల్లించింది సంస్థ.
Also read: Police Dance : పోలీసుల సరదా.. ఉద్యోగానికే ఎసరు తెచ్చింది..!
ఇక ఈ ఘటనకు సంబందించిన వార్తలు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసాయి. మాస్క్ కోసం వనరులను వృధా చేస్తారా అంటూ కొందరు వాదిస్తుంటే..అమెరికా చట్టాలు ఇంత కఠినంగా ఉన్నాయా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ఘటనపై అమెరికన్ ఎయిర్ లైన్స్ సంస్థ స్పందిస్తూ..విమానంలోని మిగతా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింత్తిస్తున్నట్లు తెలిపింది. తమ దేశ చట్టాలను గౌరవించి వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించిన తమ సిబ్బందిని సంస్థ వెనకేసుకొచ్చింది. చట్టాలు చేసుకున్నప్పుడు వాటిని పాటించాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటూ అమెరికన్ ఎయిర్ లైన్స్ చెప్పుకొచ్చింది.
Also read: Unemployed : బిగ్ ప్రాబ్లమ్.. భారత్‌లో 5.3 కోట్ల మంది నిరుద్యోగులు
1Major Movie : ఆ సంఘటన చెబితే నమ్ముతారోలేదో అని సినిమాలో పెట్టలేదు
2PM Cares: రేపే పీఎం కేర్స్ స్కాలర్‌షిప్‌ల పంపిణీ.. ప్రారంభించనున్న మోదీ
3Pan India Stars : RRR, KGF స్టార్లు ఏం చేస్తున్నారు??
4YV Subbareddy : శ్రీవారి దర్శనం కోసం భక్తులు రావొద్దని ఎప్పుడూ చెప్పలేదు : టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
5UN human rights: ఐరాస మానవ హక్కుల బృందం చైనాలో స్వేచ్ఛగా పర్యటించలేదు: అమెరికా
6Kedarnath: కేదార్‌నాథ్‌లో పేరుకుపోతున్న చెత్త.. మోదీ ఏమన్నారంటే
7Nepal plane: నేపాల్‌లో విమానం అదృశ్యం.. ప్రయాణికుల్లో భారతీయులు
8Major : బాలీవుడ్, మలయాళం వాళ్ళు అడిగినా ఒప్పుకోలేదు.. మాకు ఓకే చేశారు..
9pani puri: పానీ పూరీ తిని 97 మంది పిల్లలకు అస్వస్థత
10Elon Musk vs Bhavish: ఎలన్ మస్క్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఓలా సీఈవో
-
Tragedy : పెళ్ళిరోజే భార్య, ఇద్దరు పిల్లలను చంపి వ్యక్తి సూసైడ్..అప్పుల బాధ తాళలేక
-
masked Aadhaar card: ఆధార్ కాదు.. మాస్క్డ్ ఆధార్ ఇవ్వండి
-
Thirumala : రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న 89వేల 318 భక్తులు..కరోనా లాక్డౌన్ అనంతరం తొలిసారి
-
Strange Incident : భార్యతో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాలకే మతిమరుపు..ఐర్లాండ్ లో విచిత్ర సంఘటన
-
Monkeypox : మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఆర్టీ-పీసీఆర్ కిట్
-
Rajasthan : బావిలో దూకి ఇద్దరు పిల్లలతోపాటు ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్..మహిళల్లో ఇద్దరు గర్భిణులు
-
Hyderabad : ఉద్యోగులకు HRA పెంపు
-
Rain Forecast : మూడు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు