Unemployed : బిగ్ ప్రాబ్లమ్.. భారత్‌లో 5.3 కోట్ల మంది నిరుద్యోగులు

కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించాయి. నష్టాలు రావడంతో అనేక సంస్థలు మూతపడ్డాయి. ఫలితంగా దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోంది.

Unemployed : బిగ్ ప్రాబ్లమ్.. భారత్‌లో 5.3 కోట్ల మంది నిరుద్యోగులు

Unemployed

Unemployed : కరోనావైరస్ మహమ్మారి ఏ క్షణాన వెలుగులోకి వచ్చిందో కానీ.. అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. ఈ మహమ్మారి అనేకమంది ప్రాణాలు బలి తీసుకుంది. కొత్త రూపాల్లో విరుచుకుపడుతూనే ఉంది. కోవిడ్ దెబ్బకు యావత్ ప్రపంచం కుదేలైంది. ప్రాణ నష్టమే కాదు ఆర్థికంగా తీవ్రమైన ప్రభావం చూపిందీ మహమ్మారి. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసింది కరోనా. ఫలితంగా ఆయా దేశాలు సంక్షోభంలో కూరుకుపోయాయి.

Fever : జ్వరంతో బాధపడుతుంటే మాంసాహారం తినకూడదా?

ఇతర దేశాల సంగతి అటుంచితే.. భారత్ పైనా కరోనా మహమ్మారి తీవ్రమైన ప్రభావమే చూపింది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించాయి. నష్టాలు రావడంతో అనేక సంస్థలు మూతపడ్డాయి. ఫలితంగా దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోంది. 2021 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5.3 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇందులో మహిళా నిరుద్యోగుల సంఖ్య దాదాపు 2 కోట్ల వరకు ఉంది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తెలిపిన ఈ లెక్కలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

5.3 కోట్ల మందిలో 3.5కోట్ల మంది ఉద్యోగం కోసం నిరంతరం ప్రయత్నిస్తుండగా.. 1.7కోట్ల మంది మాత్రం జాబ్‌ చేయాలని ఉన్నా అందుకోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని సీఎంఐఈ తన నివేదికలో తెలిపిది. ఇక ఉద్యోగ వేటలో ఉన్న వారిలో 23శాతం మంది (80లక్షల మంది) మహిళలు అని తెలిపింది. జాబ్ చేయాలని ఉన్నా.. అందుకు సరైన ప్రయత్నాలు చేయకుండా ఉన్నవారిలో 53శాతం మంది (90 లక్షల మంది) మహిళలే అని వెల్లడించింది.

Omicron: ఒమిక్రాన్ కొత్త లక్షణాలు.. కంటిలో ఈ మార్పులు కనిపించొచ్చు

ఉద్యోగ వేటలో అంత యాక్టివ్‌గా లేనివారిలో సగానికి పైగా మహిళలే ఉన్నారని, అందుకు ప్రధాన కారణం అవకాశాలు లేకపోవడమే అని సీఎంఐఈ తెలిపింది. ఇక చాలా చోట్ల మహిళలంటే కంపెనీలు వెనక్కి తగ్గుతున్నాయంది. ఉద్యోగం చేయాలనుకునే మహిళలకు సామాజికంగానూ ఎలాంటి సహకారం అందడం లేదని తన నివేదికలో తెలిపింది సీఎంఐఈ. కాగా, “నిరుద్యోగ రేటులో 7.9శాతం మందికి లేదా 35 మిలియన్ల మందికి భారత్ తక్షణమే ఉపాధి అవకాశాలు కల్పించాలని” CMIE తన విశ్లేషణలో పేర్కొంది. దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న నిరుద్యోగం.. భారత్ లాంటి దేశానికి ఇబ్బందికరమైన పరిస్థితే. దీన్ని చక్కదిద్దేలా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీఎంఐఈ సూచించింది.