Modi in America : ఇద్దరు ప్రధానులు, ఐదుగురు సీఈవోలతో మోదీ కీలక సమావేశాలు

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడపనున్నారు. బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ లో పాల్గొంటారు. ఐదుగురు టాప్ సీఈవోలతో మీటింగ్ అవనున్నారు.

Modi in America : ఇద్దరు ప్రధానులు, ఐదుగురు సీఈవోలతో మోదీ కీలక సమావేశాలు

Modi In America

Modi in America : ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడపనున్నారు. బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ లో పాల్గొంటారు. ఐదుగురు టాప్ సీఈవోలతో మీటింగ్ అవనున్నారు. కరోనా మహమ్మారి సంక్షోభం తర్వాత ప్రధాని మోదీ తొలి మేజర్ ఫారిన్ విజిట్ ఇదే. అమెరికా టూర్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యొషిహిదె సుగాలతో కీలక సమావేశం కానున్నారు.

భారత్-అమెరికా మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పెట్టుకున్నారు. అలాగే జపాన్, ఆస్ట్రేలియా దేశాలతోనూ సంబంధాలు మెరుగుపరుచుకోనున్నారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీని ప్రధాని మోదీ అడ్రస్ చేస్తారు. గ్లోబల్ సవాళ్లపై మాట్లాడతారు. ప్రధాని మోదీ కొవిడ్ 19 సమ్మిట్ లో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రముఖ కంపెనీలు క్వాల్ కమ్, అడోబ్, బ్లాక్ స్టోన్ తదితర కంపెనీల సీఈవోలతో భేటీ కానున్నారు. ఒక్కో సీఈవోతో 15 నిమిషాలు మాట్లాడతారు.

Long Covid : ఈ 4 గ్రూపుల వారికి అత్యధిక ప్రమాదం

అమెరికాలో 3 రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ బ‌య‌లుదేరి వెళ్లారు. తొలిసారి నేరుగా నిర్వహిస్తోన్న క్వాడ్​ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. క్వాడ్​ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలపై సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి 76 వార్షిక సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తోనూ ప్రధాని భేటీ కానున్నారు. ఈ నెల 22 నుంచి 25 వరకు అమెరికాలో మోదీ పర్యటన కొనసాగనుంది.

Student Suicide : ఎగ్ దోశ తినేందుకు డబ్బులివ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

అమెరికా పర్యటనకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ఆహ్వానం మేర‌కు తాను ఆ దేశానికి వెళ్తున్న‌ట్లు తెలిపారు. ఈ పర్యటనలో భారత్​- అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో సమీక్షించనున్నట్లు తెలిపారు. పరస్పర ప్రయోజనం ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చించనున్నట్లు మోదీ వెల్లడించారు.

అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యొషిహిదె సుగాలతో కలిసి తొలిసారి ప్రత్యక్షంగా జరగనున్న క్వాడ్​ సమ్మిట్‌లో పాల్గొంటానని తెలిపారు. అలాగే ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో ఉగ్రవాదంపై పోరు, వాతవారణ మార్పులు సహా పలు అంశాలపై ప్రసంగించనున్నారు.

2019 తర్వాత నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. 2019 సెప్టెంబ‌ర్‌లో అమెరికా వెళ్లారు. అప్పటి అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను క‌లిశారు. ట్రంప్‌తో కలిసి హౌడీ మోడీ ఈవెంట్‌లోనూ పాల్గొన్నారు. ఆ తరువాత మళ్లీ అమెరికా విమానం ఎక్కడం ఇదే తొలిసారి.