Student Suicide : ఎగ్ దోశ తినేందుకు డబ్బులివ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, టీచర్ మందలించదనో... ఇలా చిన్న విషయాలకే టీనేజర్లు, యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి.

Student Suicide : ఎగ్ దోశ తినేందుకు డబ్బులివ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

Student Suicide

Student Suicide : చిన్న చిన్న విషయాలకే తీవ్ర మనస్తాపం చెందుతున్నారు. తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. ఇదీ నేటి టీనేజర్లు, యువత తీరు.

RTC, Electricity Charges : కరెంట్, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచే యోచనలో ప్రభుత్వం

అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, టీచర్ మందలించదనో… ఇలా చిన్న విషయాలకే టీనేజర్లు, యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. బలహీనంగా మారుతున్న టీనేజర్లు, యువత మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా తలారివారిపల్లెలో ఓ యువకుడు చిన్న కారణానికే ఆత్మహత్య చేసుకున్నాడు. ఎగ్ దోశ తినేందుకు అమ్మ డబ్బులు ఇవ్వలేదన్న మనస్తాపంతో బీటెక్ విద్యార్థి సూసైడ్ చేసుకోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది.

Card tokenisation: ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డ్ వాడే వాళ్లకు గుడ్ న్యూస్

పాకాల మండలం తలారివారిపల్లెకు చెందిన సాయికిరణ్‌(21) ఇంజినీరింగ్‌ థర్డియర్ చదువుతున్నాడు. తండ్రి మరణించడంతో తల్లే పెంచి పెద్ద చేసింది. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా కొడుకు బాగా చదువుకోవాలని ఆశించింది. ఈ క్రమంలో సాయికిరణ్ ను ఇంజినీరింగ్ చదివిస్తోంది. అయితే మంగళవారం ఉదయం సాయికిరణ్​కు ఎగ్​ దోశ తినాలనిపించి తల్లిని డబ్బులు అడిగాడు. ఇందుకు తల్లి ససేమిరా అంది.

ఇంట్లో అన్నం, కూర చేశా తినమంది. డబ్బులు వృథా చేయొద్దని కొడుకుపై కోపగించుకుంది. తల్లి అలా చెప్పడంతో సాయికిరణ్ మనస్తాపం చెందాడు. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన సాయికిరణ్.. ఇరంగారిపల్లె దగ్గర్లోని గుర్రప్పకుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ పనుల నిమిత్తం అటుగా వెళ్తున్న రైతులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు.. డెడ్‌బాడీని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చిన్న విషయానికే చేతికొచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో సాయికిరణ్ తల్లి కన్నీరుమున్నీరైంది. కేవలం ఎగ్ దోస అడిగితే వద్దని మందలించినందుకు ఇంత పని చేస్తావా అంటూ ఆ తల్లి రోదించిన తీరు గ్రామస్తులను ఆవేదనకు గురి చేసింది. చిన్న విషయానికే సాయి కిరణ్ తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయానికి గురి చేసింది. చిన్న విషయాలకే మనస్థాపానికి గురి కావడం, ప్రాణాలు తీసుకునేంతగా నిర్ణయాలు తీసుకోవడం.. యువతలో ఇలాంటి పోకడ మంచి పరిణామం కాదని నిపుణులు అంటున్నారు.