Monkey B Virus: మనుషుల్లో కొత్త వైరస్.. చైనాలో తొలి మరణం!

ఇప్పటికే కరోనా మహమ్మారి వలన ఉక్కిరిబిక్కిరి అయిన ప్రపంచ దేశాలు కరోనా పుట్టిన చైనాను దోషిని చేశాయి. వూహన్ ల్యాబ్ లో కరోనా మహమ్మారి పుట్టిందా లేక చైనా సృష్టించిందా అనే ప్రశ్నలు వినిపిస్తుండగానే కరోనా మ్యుటెంట్లు, వేరియంట్లు అని రూపాంతరం చెందుతూ ఇంకా ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఇదిలా ఉండగానే చైనాలో మరో వైరస్ తో ఓ వ్యక్తి మరణించడం సంచలనంగా మారింది.

Monkey B Virus: మనుషుల్లో కొత్త వైరస్.. చైనాలో తొలి మరణం!

Monkey B Virus

Monkey B Virus: ఇప్పటికే కరోనా మహమ్మారి వలన ఉక్కిరిబిక్కిరి అయిన ప్రపంచ దేశాలు కరోనా పుట్టిన చైనాను దోషిని చేశాయి. వూహన్ ల్యాబ్ లో కరోనా మహమ్మారి పుట్టిందా లేక చైనా సృష్టించిందా అనే ప్రశ్నలు వినిపిస్తుండగానే కరోనా మ్యుటెంట్లు, వేరియంట్లు అని రూపాంతరం చెందుతూ ఇంకా ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఇదిలా ఉండగానే చైనాలో మరో వైరస్ తో ఓ వ్యక్తి మరణించడం సంచలనంగా మారింది. మంకీ బీ వైరస్‌ సోకి తొలిసారిగా బీజింగ్‌కు చెందిన 53 ఏళ్ల పశువుల వైద్యుడు కన్నుమూశాడు.

చైనాలో నాన్‌-హ్యూమన్‌ ప్రైమేట్లపై పరిశోధన చేస్తున్న సంస్థలో పనిచేసే పశువైద్యుడు మొదట వికారం వాంతులు లాంటి లక్షణాలతో బాధపడ్డాడు. దీంతో అతను అనేక ఆసుపత్రులలో చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో చివరికి మే 27న మరణించాడు. మార్చి ప్రారంభంలో చనిపోయిన రెండు కోతులను విడదీసిన ఒక నెల తరువాత అతను వైరస్‌ బాడిన పడ్డారని సీడీసీ వెల్లడించింది. ఏప్రిల్‌లో అతని సెరెబ్రోస్పానియల్ ద్రవాన్ని సేకరించిన పరిశోధకులు అతన్ని మంకీ బీవీకి పాజిటివ్‌గా గుర్తించారు.

అయితే అతని దగ్గరి పరిచయాలున్నవారి నమూనాల పరీక్షలు మాత్రం నెగిటివ్‌ వచ్చాయి. పశువైద్యుడికి సోకిన వైరస్ 1932లో గుర్తించిన మకాకా జాతికి చెందిన మకాక్లలో ఆల్ఫాహెర్పెస్వైరస్ ఎంజూటిక్ గా నిర్ధారించారు. ఈ వైరస్ డైరెక్ట్‌ గా లేదా శారీరక స్రావాల ద్వారా సోకుతుందని.. ఈ వైరస్ సోకితే మరణాల రేటు 70 శాతం నుండి 80 శాతం వరకు ఉంది.