Monkey pox : యూకేలో మంకీ పాక్స్ వైరస్ కలకలం..

దాదాపు మూడేళ్ల నుంచి కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తునే ఉంది. కొత్త కొత్త వేరియంట్లుగా మారి భయపెడుతోంది. ఇదిలా ఉంటే సరికొత్త వైరస్ లు వెలుగులోకి వస్తున్నాయి. భారత్ లోని కేరళలో టమాటా ఫ్లూ వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈక్రమంలో యునైటెడ్ కింగ్ డమ్ లో మరో వైరస్ కలకలం రేపుతోంది. అదే ‘మంకీ పాక్స్ వైరస్’.

Monkey pox : యూకేలో మంకీ పాక్స్ వైరస్ కలకలం..

Uk Reports First Case Of Monkeypox

monkey pox case reported in UK : దాదాపు మూడేళ్ల నుంచి కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తునే ఉంది. కొత్త కొత్త వేరియంట్లుగా మారి భయపెడుతోంది. ఇదిలా ఉంటే సరికొత్త వైరస్ లు వెలుగులోకి వస్తున్నాయి. భారత్ లోని కేరళలో టమాటా ఫ్లూ వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈక్రమంలో యునైటెడ్ కింగ్ డమ్ లో మరో వైరస్ కలకలం రేపుతోంది. అదే ‘మంకీ పాక్స్ వైరస్’.ఆఫ్రికా దేశమైన నైజీరియాకు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తికి మంకీ పాక్స్ వైరస్ సోకిందని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ధ్రువీకరించింది.

మంకీ పాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్ చాలా అరుదుగా జరుగుతాయని, భయపడాల్సిన అవసరం లేదని..ఇది అంత సులువుగా వ్యాపించే వైరస్ కాదని.. ఆందోళన పడాల్సిన పనిలేదని తెలిపింది. ఈ వైరస్ సాధారణంగా ఎక్కువగా వ్యాప్తి చెందే వైరస్ కాదని, ఇది చాలా తక్కువ మందిలో మాత్రమే ఎక్కువ తీవ్రత కలిగిస్తుందని..ఈ వైరస్‌ బారిన పడ్డ చాలా మంది బాధితులు చాలా తేలిగ్గా రికవరీ అయ్యారని తెలిపింది. మంకీ పాక్స్ 50 ఏళ్ల క్రితమే కనుగొనబడింది. 2018లో కూడా యూకేలో ఓ కేసు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ వైరస్ కేసులు వేళ్ల మీద లెక్కించిన స్థాయిలో తక్కువగానే రిపోర్టు అయ్యాయి.

మంకీ పాక్స్ లక్షణాలు..
మంకీపాక్స్ అనేది ఒక అరుదైన జూనోటిక్ వ్యాధి, ఇది సోకిన జంతువుల నుండి మానవులకు వ్యాపిస్తుంది.

స్మాల్ పాక్స్‌కు ఉండే లక్షణాలే చాలా వరకు మంకీ పాక్స్ వైరస్ లక్షణాలుగా ఉంటాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కండరాల్లో నొప్పి, తీవ్ర నీరసం వంటివి మంకీ పాక్స్ లక్షణాలుగా చెప్పొచ్చు. ముఖం, చేతులపై చర్మంపై దద్దుర్లు వస్తాయి. సాధారణంగా ఈ వైరస్ మన బాడీలోకి చేరిన 6 నుంచి 13 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల వ్యవధి కూడా పడుతుంది.

ఈ మంకీ పాక్స్ వైరస్ తొలి సారి 1958లో కనిపించింది. కోతులను కొన్ని కాలనీలుగా విభజించి వాటిపై పరిశోధనలు చేశారు. ఆ పరిశోధన జరుగుతున్న సమయంలోనే ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది. దీంతో దీనికి మంకీ పాక్స్ అనే పేరు పెట్టారు.

ఈ వైరస్ తొలిసారి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో‌లో 1970లో చోటుచేసుకుంది. 50 ఏళ్ల క్కరితం తొలిసారి ఈ వైరస్ మనుషుల్లో కూడా కనిపించింది.

ఈ వైరస్ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు వైరస్ సోకవచ్చు. ఈ వైరస్ మనిషి ద్రవాల నుంచి ఇతరులకు సోకే అవకాశం ఉన్నది. రక్తం ద్వారా కూడా వ్యాపించవచ్చు.

ఎలుకలు, ఉడుతల వంటి జాతులతో ఈ వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశం ఉన్నది. అలాగే, ఈ వైరస్ సోకిన జంతువును సరిపడా ఉష్ణోగ్రతల వద్ద ఉడకబెట్టకుంటే కూడా మనిషికి ఈ వైరస్ సోకే ముప్పు ఉన్నది.

మంకీ పాక్స్ వైరస్‌కు ప్రత్యేకమైన చికిత్స అందుబాటులో లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. స్మాల్ పాక్స్ వైరస్‌ నివారణకు ఇచ్చే టీకాను మంకీ పాక్స్ వైరస్‌కు కూడా ఇవ్వొచ్చు. ఈ టీకా 85 శాతం మంకీ పాక్స్ వైరస్‌ను ఎదుర్కొంటుందని నిపుణులు చెప్పారు.