China COVID: చైనా ఒకవేళ జీరో కొవిడ్ పాలసీని ఎత్తేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గగా, చైనాలో మాత్రం కొన్ని రోజులుగా భారీగా పెరిగిపోతుండడం ఆ దేశ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. చాలా మంది చైనీయులు భయంతో ముందస్తుగా వెంటిలేటర్లు, ఆక్సిజన్ మిషన్లు కొనిపెట్టుకుంటున్నారని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొంది. ఒకవేళ చైనా జీరో కొవిడ్ పాలసీని ఎత్తి వేస్తే ఆ దేశంలో దాదాపు 1.2 కోట్ల కుటుంబాలకు వెంటిలేటర్లు, ఆక్సిజన్ మిషన్లు అవసరం అవుతాయని చెప్పింది.

China COVID: చైనా ఒకవేళ జీరో కొవిడ్ పాలసీని ఎత్తేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?

China COVID

China COVID: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గగా, చైనాలో మాత్రం కొన్ని రోజులుగా భారీగా పెరిగిపోతుండడం ఆ దేశ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. చాలా మంది చైనీయులు భయంతో ముందస్తుగా వెంటిలేటర్లు, ఆక్సిజన్ మిషన్లు కొనిపెట్టుకుంటున్నారని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొంది. ఒకవేళ చైనా జీరో కొవిడ్ పాలసీని ఎత్తి వేస్తే ఆ దేశంలో దాదాపు 1.2 కోట్ల కుటుంబాలకు వెంటిలేటర్లు, ఆక్సిజన్ మిషన్లు అవసరం అవుతాయని చెప్పింది.

చైనా ప్రభుత్వం కరోనాను అదుపు చేయలేకపోతుండడంతో కేసులు మరిన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయి. నవంబరు 11న చైనా కరోనా ఆంక్షలను సడలించిన కొన్ని గంటల్లోనే చాలా మంది ప్రజలు మెడికల్ స్టోర్స్ కు వెళ్లి కొవిడ్-19కు సంబంధించిన వైద్య పరికరాలను విపరీతంగా కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు.

YS Sharmila: వైఎస్సార్టీపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తత.. షర్మిల అరెస్ట్

అయితే, అప్పటికే ఆ వైద్య పరికరాల కొరత ఏర్పడింది. వెంటిలేటర్లు, ఆక్సిజన్ మిషన్లు, ఆక్సిమీటర్లను కొనుగోలు చేయడానికి ఇంటర్నెట్ లో సెర్చ్ చేసే వారి సంఖ్య అతి భారీగా పెరిగింది. ఇప్పటికే ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడింది.

చైనాలో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థపై ఆధారపడకూడదని భావిస్తున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది. ప్రపంచం మొత్తం హెర్డ్ ఇమ్యూనిటీ కోసం ప్రయత్నిస్తుంటే చైనా మాత్రం జీరో కొవిడ్ విధానాన్ని పాటిస్తుండడం, కఠిన ఆంక్షలు విధిస్తుండడంతో డ్రాగన్ దేశం కొవిడ్ ను కట్టడి చేయడంలో విఫమవుతోందని విమర్శలు వస్తున్నాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..