Omicron Cases : ప్రపంచవ్యాప్తంగా 81 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు.. 97 దేశాలకు పాకిన కొత్త వేరియంట్

డెన్మార్క్ లో 23 వేల ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇండియాలో ఇప్పటివరకు 173 కొత్త వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి.

Omicron Cases : ప్రపంచవ్యాప్తంగా 81 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు.. 97 దేశాలకు పాకిన కొత్త వేరియంట్

Omicron (5)

More than 81 thousand Omicron cases : ప్రపంచదేశాలను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. 97 దేశాలకు కొత్త వేరియంట్ పాకింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 81 వేలకు దాటింది. యూకేలో 45,145 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. కొత్త వేరియంట్ తో 12 మంది మృతి చెందారు. ఒమిక్రాన్‌ బారిన పడిన 104 మంది వివిధ ఆస్పత్రుల్లో చేరారని బ్రిటన్‌ ఉప ప్రధానమంత్రి డొమినిక్‌ రాబ్ వెల్లడించారు.

డెన్మార్క్ లో 23 వేల ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇండియాలో ఇప్పటివరకు 173 కొత్త వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 54 ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. ఢిల్లీలో 28, తెలంగాణలో 21 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. కర్నాటకలో 19, రాజస్థాన్ లో 17 ఒమిక్రాన్ కేసులు రిజిస్టర్ అయ్యాయి.

Christmas Celebrations : సీఎం కేసీఆర్‌ క్రిస్మస్‌ విందు

కేరళలో 15, గుజరాత్ లో 14, యూపీలో 2 కొత్త వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఒక్కో ఒమిక్రాన్ కేసు చొప్పున గుర్తించారు. కాగా దేశంలో ఒమిక్రాన్ బాధితుల్లో ఒక్కరికి మాత్రమే ఆరోగ్యపరిస్థితి కొంచం విషమంగా ఉందని.. మిగతా వారు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు చెబుతున్నారు.