పిల్లి కూనలకు అస్వస్థత..హాస్పిటల్‌కు తీసుకెళ్లిన తల్లి పిల్లి

పిల్లి కూనలకు అస్వస్థత..హాస్పిటల్‌కు తీసుకెళ్లిన తల్లి పిల్లి

Mother Cat Carries Her Sick Kitten Into Hospital

Mother cat carries her sick kitten into hospital : అమ్మతనం అనేది మనుషులకైనా జంతువులకైనా..పక్షులకైనా ఒక్కటే. పిల్లలకు ప్రమాదం జరుగుతుందని తెలిస్తే తన ప్రాణాలను పణ్ణంగా పెడతాయి జంతువులు కూడా. పిల్లలకు నలతగా ఉంటే తల్లి ప్రాణం ఊరుకుంటుందా?తల్లడిల్లిపోతుంది. అది మనిషి అయినా అంతే జంతువైనా అంతే. అలా ఓ పిల్లి తన కూనలకు అనారోగ్యంగా ఉన్నాయి. డల్ గా ఉండటంచూసి..తల్లడిల్లిపోయింది తల్లి పిల్లి.

అలాగని ఊరుకోలేదు. పిల్లల్ని నోట కరచుకుని బయలుదేరింది. ఎక్కడికింటే హాస్పిటల్ కు. ఆ పిల్లికి తన పిల్లల్ని హాస్పిటల్ కు తీసుకెళ్లాలని ఎలా తెలిసిందో..?బిడ్డల కోసం తల్లిపిల్లి పడిన శ్రమ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ఎలాగైనా తన పిల్లి కూనకు వైద్యం అందేలా చేయటానికి తల్లి పిల్లి పడిన తపనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.టర్కీలోని కరబాగ్లార్ జిల్లాలో కొన్ని రోజుల క్రితమే పుట్టిన తన పిల్లి కూనలకు అనారోగ్యం చేయటంలో వైద్య సహాయం కోరుతూ..పిల్లను నోటితో పట్టుకొని హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. పిల్లల్ని నోట కరచుకుని తీసుకొచ్చిన పిల్లిని చూసిన డాక్టర్లు ఆ పిల్లల్ని తీసుకుని పరీక్షించారు.

పిల్లి పిల్ల కంటికి ఇన్‌ఫెక్షన్ వచ్చినట్టు గుర్తించారు. హాస్పిటల్ సిబ్బంది వెటర్నరీ డాక్టర్‌కు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన ఒక మహిళా వెటర్నీరీ వైద్యురాలు దానికి చికిత్స అందించారు. దీనికి సంబంధించిన వీడియోను గల్ఫ్ టుడే వార్తాసంస్థ షేర్ చేసింది. ఈ రెండు నిమిషాల వీడియోలో.. పిల్లి దాని పిల్లను నోట కరుచుకొని హాస్పిటల్‌కు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. అక్కడ ఉన్న ప్రజలు దానికి దారి ఇస్తూ వీడియో తీశారు. ఆ తరువాత పిల్లి పిల్ల కంటికి ఇన్‌ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు. వెటర్నరీ వైద్యులు దాని కంటి చుక్కలు వేసి చికిత్స అందించారు.

ఒకరోజు ఉదయం పిల్లి కూనను హాస్పిటల్‌కు తీసుకెళ్లిన తల్లి పిల్లి.. సాయం కోసం చాలాసేపు అరిచిందని గల్ఫ్ టుడే వార్తాసంస్థ తెలిపింది. అక్కడే ఆరోగ్యంగా ఉన్న మరో పిల్లి పిల్ల కనిపించింది. వీటిని వారు ఒక డబ్బాలో పెట్టి, ఆహారం అందించారు. ఒక పిల్లి కూనకు కంటి సమస్య ఉండటంతో స్థానిక వెటర్నరీ హాస్పిటల్‌కు సమాచారం అందించారు. అక్కడి వైద్యులు దానికి చికిత్స చేశారు. అప్పటికి దాని కన్ను ఒకటి పూర్తిగా మూసుకుపోయి ఉంది. చికిత్స తరువాత ఆ పిల్లికూన కోలుకుంటోంది. ఆ పిల్లి ఆ ప్రాంతంలోనే ఉంటోందనీ..కొన్ని రోజుల క్రితం అది పిల్లల్ని పెట్టిందని స్థానికంగా నివసిస్తోందని వైద్య సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం దానికి, పిల్లి పిల్లలకు ఆహారం అందిస్తున్నామని చెప్పారు.