Musk on Tesla: ఒకవేళ నన్ను ఏలియన్స్ కిడ్నాప్ చేసినా..?

ట్విట్టర్‭లో మస్క్ చాలా చురుగ్గా ఉంటారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ ‘‘నేను ట్విట్టర్ ఎక్కువగా వాడతాను. కాబట్టి వినియోగదారులకు ఉపయోగపడే ప్రాడక్ట్ ఏంటో నాకు తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‭ను మరింత ఉత్తమంగా తయారు చేయగలనని అనుకుంటున్నాను. అలా అని ప్రతి కంపెనీని కొనుగోలు చేయడానికి నేనేమీ ప్రేవేట్ ఈక్విటీ ఫిర్మ్‭ని కాను’’ అని అన్నారు.

Musk on Tesla: ఒకవేళ నన్ను ఏలియన్స్ కిడ్నాప్ చేసినా..?

Musk invokes aliens when asked about his successor

Musk on Tesla: తనను ఏలియన్స్ కిడ్నాప్ చేసినా, లేదంటే తాన గ్రహానికి తిరిగి వెళ్లిపోయినా టెస్లా గొప్పగానే పని చేస్తుందని, మరింత ముందుకు వెళ్తుందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సరదాగా వ్యాఖ్యానించారు. ట్విట్టర్‭ను కొనుగోలు చేస్తే మస్క్ టెస్లా నుంచి వెళ్లిపోతారని, ఒకవేళ అదే జరిగితే టెస్లాకు కాబోయే అధినేత ఎవరని అడిగిన ప్రశ్నకు మస్క్ పై విధంగా సమాధానం ఇచ్చారు. వాస్తవానికి టెస్లా సీఈవో పదవి నుంచి మస్క్ దిగిపోతున్నారని, ఈ వ్యాఖ్యలు ఆయనే స్వయంగా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని మస్క్ ఖండించారు. వీలైనన్ని ఎక్కువ రోజులు టెస్లా సీఈవోగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.

తాజాగా టెస్లా స్టాక్ హోల్డర్లతో వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టెస్లాలో ఒక స్టాక్ హోల్డర్ అయిన గేరి బ్లాక్ మీటింగ్‭కు హాజరైన వారిని ఉద్దేశించి సరదాగా ప్రసంగించారు. ‘‘మరో రెండు నెలల్లో మీరు ట్విట్టర్‭ను కొనుగోలు చేయాలా వద్దా అని కోర్టు నిర్ణయిస్తుంది. అదే జరిగితే బోర్డు వారసత్వం ఎవరికి ఇవ్వబోతున్నారు? మీ పని విభజన ఏ విధంగా ఉండబోతోంది?’’ అని మస్క్‭ను గేరి సరదాగా ప్రశ్నించారు. దీనికి మస్క్ అంతే సరదాగా ప్రతిస్పందిస్తూ ‘‘మనం ఎవరో చేసిన వాటిని కాపీ చేయము. మనం ఏం చేసినా కొత్తదే చేస్తాం. కంపెనీకి వీలైనంత సహకారం నేను కూడా ఇస్తాను. బహుశా నేను కంపెనీకి ఎక్కువగా ఉపయోగపడతానని అనుకుంటాను. ప్రోడక్ట్ డిజైన్, ఫ్యాక్టరీ డిజైన్, తయారీ పనుల్లో నా అవసరం ఎక్కువగా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు.

‘‘ఒకవేళ నన్ను ఏలియన్లు కిడ్నాప్ చేసినా, లేదంటే నా గ్రహానికి నేను వెళ్లిపోయినా టెస్లా బాగానే పని చేస్తుంది. మనకు చాలా తెలివైన టీం ఉంది. టెస్లాను మరింత అభివృద్ధి పర్చడానికి వాళ్లెంతో పని చేస్తారు’’ అని మస్క్ అన్నారు. అయితే ట్విట్టర్‭పై కానీ ప్రస్తుతం కొనసాగుతున్న కేసు గురించి కానీ మస్క్ స్పందించలేదు. ట్విట్టర్‭లో మస్క్ చాలా చురుగ్గా ఉంటారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ ‘‘నేను ట్విట్టర్ ఎక్కువగా వాడతాను. కాబట్టి వినియోగదారులకు ఉపయోగపడే ప్రాడక్ట్ ఏంటో నాకు తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‭ను మరింత ఉత్తమంగా తయారు చేయగలనని అనుకుంటున్నాను. అలా అని ప్రతి కంపెనీని కొనుగోలు చేయడానికి నేనేమీ ప్రేవేట్ ఈక్విటీ ఫిర్మ్‭ని కాను’’ అని అన్నారు.

Elon Musk: నన్ను మభ్యపెట్టి సంతకం పెట్టించారు: ట్విట్టర్‭పై మస్క్ ఆరోపణ