Elon Musk: “అందరూ అనుకున్నట్టు కాదు.. అసలు నిజం వేరే ఉంది”

"మీకొకటి క్లియర్ కావాల్సి ఉంది. నా టైంలో 5శాతం కంటే తక్కువ ట్విట్టర్ కోసం కేటాయిస్తాను. అదేమీ రాకెట్ సైన్స్ కాదే. నిన్న గిగా టెక్సాస్, ఇవాళ స్టార్ బేస్. కానీ, టెస్లా అనేది 24/7 నా మైండ్ లో ఉంటుంది" అని ట్వీట్ లో పేర్కొన్నాడు.

Elon Musk: “అందరూ అనుకున్నట్టు కాదు.. అసలు నిజం వేరే ఉంది”

Alon Musk

 

 

Elon Musk: టెస్లా నా మైండ్ లో 24గంటలు తిరుగుతూనే ఉంటుందంటున్నారు బిజినెస్ దిగ్గజం ఎలన్ మస్క్. ట్విట్టర్ లో వైరల్ అయిన ఓ ఫొటోను పోస్టు చేస్తూ ఈ కామెంట్ చేశారు. “మీకొకటి క్లియర్ కావాల్సి ఉంది. నా టైంలో 5శాతం కంటే తక్కువ ట్విట్టర్ కోసం కేటాయిస్తాను. అదేమీ రాకెట్ సైన్స్ కాదే. నిన్న గిగా టెక్సాస్, ఇవాళ స్టార్ బేస్. కానీ, టెస్లా అనేది 24/7 నా మైండ్ లో ఉంటుంది” అని ట్వీట్ లో పేర్కొన్నాడు.

ఆ ఫొటోలో టెస్లా అనే చేయి పట్టుకున్న ఎలన్ మస్క్.. అటుగా వెళ్తున్న ట్విట్టర్ అనే వైపుగా చూస్తూ ఉంటాడు. దానిని పోస్టు చేస్తూ అందరూ ఇలానే అనుకుంటారు. కానీ, నిజం అది కాదని వెల్లడించాడు.

టెస్లా ఈ సంవత్సరం టెక్సాస్‌లో తన కొత్త కార్ ఫ్యాక్టరీని ప్రారంభించింది. అంతేకాకుండా మస్క్ రాకెట్ కంపెనీ స్పేస్‌ఎక్స్ టెక్సాస్‌లోని బోకా చికాలో స్టార్‌బేస్ అనే ప్రయోగాత్మక సైట్‌ను ఏర్పాటుచేసింది. ఏప్రిల్ ప్రారంభంలో ట్విట్టర్‌లో తన వాటాను మస్క్ వెల్లడించినప్పటి నుండి టెస్లా షేర్లు వాటి విలువలో మూడింట ఒక వంతు కోల్పోయాయి.

Read Also : ట్విట్టర్ డీల్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్